ఉత్కంఠ పోరులో సూపర్‌నోవాస్‌ విజయం - suprenovas won by 2 runs on Trailblazers
close
Published : 08/11/2020 02:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉత్కంఠ పోరులో సూపర్‌నోవాస్‌ విజయం

షార్జా: ఉత్కంఠ పోరులో ట్రయల్‌బ్లేజర్స్‌పై సూపర్‌నోవాస్‌ విజయం సాధించింది. చివరి బంతి వరకు ఇరు జట్లను దోబూచులాడిన విజయం చివరికి హర్మన్‌సేనను వరించింది. మొదట సూపర్‌నోవాస్‌ టాస్‌ నెగ్గి నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు చేసింది. అనంతరం 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రయల్‌బ్లేజర్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులే చేసింది. దీంతో రెండు పరుగుల తేడాతో హర్మన్‌సేన గెలిచింది. 

147 పరుగుల లక్ష్యంతో చేధనకు దిగిన స్మృతి మంధాన సేనకు మంచి ఆరంభమే లభించింది. ఆ జట్టు 44 పరుగుల వద్ధ డాటిన్‌(27) సెల్మన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగింది. అనంతరం 48 పరుగుల వద్ద రిచా ఘోష్‌ ఔటైంది. దీంతో కెప్టెన్‌ మంధాన, దీప్తి శర్మ(43) జట్టును ముందుండి నడిపించారు. ఈ క్రమంలో జట్టు స్కోరు 83 పరుగుల వద్ద స్మృతి(33) ఔటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హేమలత (4) సైతం వెంటనే వెనుదిరిగింది. వెంటవెంటనే వికెట్లు పడడంతో ఆ జట్టు ఆత్మరక్షణలో పడింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన హర్లీన్‌(27)తో కలిసి దీప్తి శర్మ పరుగుల వేగం పెంచింది. ఈ క్రమంలో చివరి ఓవర్‌లో ట్రయల్‌ బ్లేజర్స్‌కు 10 పరుగులు అవసరం కాగా జట్టు స్కోరు 143 పరుగుల వద్ధ హర్లీన్‌ ఔటైంది. ఇక చివరి బంతికి ఆ జట్టుకు 4 పరుగుల అవసరం కాగా కేవలం ఒక పరుగు మాత్రమే వచ్చింది. దీంతో ఆ జట్టు ఓటమి చవిచూసింది.      

మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సూపర్‌నోవాస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 146 పరుగులు చేసింది. హర్మన్‌సేనకు ఓపెనర్లు చామరి, ప్రియ చక్కటి శుభారంభాన్ని అందించారు. జాగ్రత్తగా ఆడుతూ పరుగులు రాబట్టడంలో మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యం చక్కగా కొనసాగుతుండగా.. 12వ ఓవర్ సల్మా బౌలింగ్‌లో దీప్తి చేతికి చిక్కి ప్రియ ఔటైంది. అర్ధశతకం పూర్తి చేసుకున్న అనంతరం 17వ ఓవర్‌ హర్లీన్‌ బౌలింగ్‌లో చామరి(67) సైతం హేమలత చేతికి చిక్కి పెవిలియన్‌ బాట పట్టింది. అనంతరం క్రీజులోకి వచ్చిన వారిలో హర్మన్‌ప్రీత్ ‌(31, 29 బంతుల్లో) రాణించినప్పటికీ.. తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. చివరి ఓవర్‌లో సూపర్‌నోవాస్‌ రనౌట్‌ రూపంలో మూడు వికెట్లు కోల్పోయింది. ట్రయల్‌బ్లేజర్స్‌ బౌలర్లలో గోస్వామి, సల్మా, హర్లీన్‌ తలా ఒక్కో వికెట్‌ తీశారు.

సూపర్‌నోవాస్‌ జట్టులో 67 పరుగులు చేసిన చామరి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైంది. ఇక తొలిరెండు స్థానాల్లో నిలిచిన ట్రయల్‌బ్లేజర్స్‌, సూపర్‌నోవాస్‌ ఫైనల్‌కు వెళ్లాయి. ఈనెల 9న ఇరు జట్లు షార్జా వేదికగా తలపడనున్నాయి. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని