Raina Oxygen అభ్యర్థన.. Sonusood సాయం - suresh raina asks for oxygen cylinder sonusood responded immediately
close
Published : 07/05/2021 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Raina Oxygen అభ్యర్థన.. Sonusood సాయం

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా గురువారం అత్యవసర పరిస్థితుల్లో ప్రాణవాయువు సాయం కోరాడు. దానికి ప్రముఖ నటుడు సోనూసూద్‌ వెంటనే స్పందించి సరైన సమయంలో సహాయం చేశాడు. అసలేం జరిగిందంటే.. మీరట్‌లో ఒక మహిళకు కొవిడ్‌-19 సోకిందని, దాంతో ఆమె ఊపిరితిత్తులు బాగా దెబ్బతిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, వెంటనే ప్రాణవాయువు కావాలని ట్వీట్‌ చేశాడు. దానికి ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను సైతం ట్యాగ్‌ చేశాడు.

అయితే, ఈ ట్వీట్‌ చూసిన సోనూసూద్‌ తనకు అవసరమైన సమాచారం పంపాలని కోరాడు. అనంతరం పది నిమిషాల్లో ఆమె చికిత్స పొందుతున్న ఆస్పత్రికి ఆక్సిజన్‌ సిలిండర్‌ పంపిస్తున్నట్లు రీట్వీట్‌ చేశాడు. కాగా, సోనూ ట్వీట్‌ చేసిన కొద్దిసేపట్లోనే ఆమెకు ప్రాణవాయువు అందిందని రైనా మళ్లీ ఇంకో ట్వీట్‌ చేశాడు. ఈ సందర్భంగా తనకు సహాయం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెప్పాడు. సోనూ గతేడాది లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఎంతో మందికి సహాయం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సూద్‌ ఫౌండేషన్‌ పేరిట ఇప్పుడు అత్యవసరమైన వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని