వానా.. వానా.. తేనెల వాన! - suresh raina enjoyed rain with daughter
close
Published : 23/07/2020 02:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వానా.. వానా.. తేనెల వాన!

కుమార్తెతో కలిసి ఎంజాయ్‌ చేసిన సురేశ్‌ రైనా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముద్దులొలికే తమ చిట్టి తల్లులతో ఆస్వాదించే సమయం కన్నా విలువైంది ఏముంటుంది? అందుకే అవకాశం వస్తే ఎవ్వరూ వదిలిపెట్టరు. తమ గారాల పట్టితో ఆడుకొనేందుకే మొగ్గు చూపిస్తారు. టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ సురేశ్ రైనా సైతం ఇందుకు భిన్నమేమీ కాదు.

దిల్లీ నగరంలో వర్షం పడగానే ఆ ప్రకృతి పరవశాన్నీ తన కుమార్తె గ్రేసియా రైనాతో కలిసి ఆస్వాదించాడు. కారులో ఆమెను డ్రైవ్‌కు తీసుకెళ్లాడు. బోరున వర్షం కురుస్తుండగా బ్యాక్‌గ్రౌండ్‌లో మంచి సంగీతం వస్తుండగా తనే స్వయంగా కారు నడుపుతూ ఆమెతో కాసేపు గడిపాడు. ఈ సంగతిని ట్విటర్‌‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘నా చిట్టి తల్లిని డ్రైవ్‌కు తీసుకెళ్లాను! ఆమె వర్షంతో ప్రేమలో పడింది’ అంటూ వ్యాఖ్య పెట్టాడు.

ప్రస్తుతం రైనా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌ లేదు. జాతీయ జట్టులోకి ఎంపికవ్వడం లేదు. అందుకే ఐపీఎల్‌ ఆడాలని ఉవ్విళ్లూరుతున్నాడు. మార్చికి ముందు చెన్నై సూపర్‌కింగ్స్‌ నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఎంఎస్‌ ధోనీ, అంబటి రాయుడుతో కలిసి అతడు సాధన చేశాడు. టీ20 స్పెషలిస్టుగా పేరు పొందిన రైనా విదేశీ లీగుల్లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని