Covid: ₹కోటి విరాళమిచ్చిన సూర్య, కార్తి - suriya and karthi donated 1 crore towards the cm relief
close
Published : 13/05/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid: ₹కోటి విరాళమిచ్చిన సూర్య, కార్తి

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజుకు వందల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖులు తమవంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తమిళ హీరోలు సూర్య, కార్తి కూడా తమవంతు ఆర్థిక సాయం ప్రకటించారు. ఇద్దరు సోదరులు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను బుధవారం కలిశారు. ఈ సందర్భంగా రూ.కోటి విరాళంగా ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. కరోనాతో పోరులో తమవంతుగా ఈ ఆర్థిక సాయం చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేయడంలో సూర్య ముందుంటారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన పేద చిన్నారులకు ఉచితంగా విద్య అందించేందుకు అగరం ఫౌండేషన్‌ పేరుతో స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని