‘సూర్య 40’ షురూ - suriya40 shoot begins
close
Updated : 15/02/2021 14:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సూర్య 40’ షురూ

చెన్నై: సూర్య కథానాయకుడుగా పాండిరాజ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ దీనిలో కథానాయిక. సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘సూర్య 40’ వర్కింగ్‌ టైటిల్‌తో దీనిని ప్రారంభించారు. సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో షూటింగ్‌ ప్రారంభించినట్టు నిర్మాణ సంస్థ సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసింది.

సూర్య మినహా ఇతర తారాగణం సెట్స్‌లో అడుగుపెట్టింది. సూర్య త్వరలోనే చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఈ సినిమాకు డి.ఇమాన్‌ సంగీతం అందిస్తున్నారు. గతంలో పాండిరాజ్‌-సూర్య కాంబినేషన్‌లో ‘పసంగ 2’ చిత్రం రూపొందింది. తెలుగులో ‘మేము’ పేరుతో విడుదలైంది. మరోసారి ఈ కలయికలో సినిమా వస్తుండటంతో అంచనాలు పెరుగుతున్నాయి.

ఇదీ చదవండి..

#చిరు ట్వీట్స్‌ : ఈ వీడియో చూశారా!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని