Suriya39: ‘జై భీమ్‌’ అంటున్న సూర్య - suriyas jai bhim firstlook poster out actor to play lawyer in film
close
Published : 23/07/2021 19:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Suriya39: ‘జై భీమ్‌’ అంటున్న సూర్య

ఇంటర్నెట్‌డెస్క్‌: తమిళ నటుడు సూర్య వరుస చిత్రాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. జులై 23(శుక్రవారం) సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన తదుపరి చిత్రాల విశేషాలను ఆయా చిత్రబృందాలు ప్రకటించాయి. సూర్య హీరోగా నటిస్తోన్న 39వ చిత్రం పేరు ‘ జై భీమ్‌’గా ఖరారైంది. ఈ సందర్భంగా సూర్య ‘జై భీమ్‌’ ఫస్ట్‌లుక్‌ని ట్విటర్‌ వేదికగా పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. నల్లకోటు ధరించి.. పేదల హక్కులు, న్యాయం కోసం పోరాడే న్యాయవాదిగా ఇందులో కనిపించనున్నారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌ జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రజిషా విజయన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకి కథను అందించిన మణికందన్‌.. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. సీన్ రోల్డాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక సూర్య 40వ చిత్రంగా పాండిరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఎత్తారెక్కుమ్‌ తునిందవన్‌’ చిత్రాల ఫస్ట్‌, సెకండ్‌, థర్డ్‌ లుక్‌ సైతం ఈరోజే విడుదలయ్యాయి. ఇక ఫస్ట్‌లో పక్కా మాస్‌ గెటప్‌లో తెల్ల పంచె, చొక్కా వేసుకొని ఓ చేతిలో ఖడ్గం, మరో చేతిలో తుపాకీతో ఓ షెడ్డులో విలన్లను వెంబడించి వేటాడుతూ సూర్య కనిపించాడు. ఇప్పటికే 2కోట్ల వ్యూస్‌ని దక్కించుకొని ట్రెండింగ్‌లో ఉంది. ఇమ్మాన్‌ సంగీత దర్శకత్వంలో ఈచిత్రం రాబోతుంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని