కొన్ని విషయాలు నా చేతుల్లో ఉండవు: సూర్య  - surya kumar says not disappointed with controvercial dismissal and few things are not in his control
close
Published : 20/03/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొన్ని విషయాలు నా చేతుల్లో ఉండవు: సూర్య 

అలా ఔటవ్వడంతో నిరాశ చెందలేదు..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో బ్యాటింగ్‌ చేసే అవకాశం దక్కడంతో టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(57; 31 బంతుల్లో 6x4, 3x6) రెచ్చిపోయాడు. వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకొని ఇంగ్లాండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే, అర్ధశతకం తర్వాత మరింత ధాటిగా ఆడుతున్న అతడు అనూహ్య రీతిలో ఔటయ్యాడు. సామ్‌కరన్‌ బౌలింగ్‌లో డేవిడ్‌ మలన్‌ చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు. కానీ, రీప్లేలో బంతి నేలకు తాకుతున్నట్లు తేలడంతో అది వివాదాస్పదంగా మారింది.

టీమ్‌ఇండియా 14వ ఓవర్‌లో సామ్‌కరన్‌ బౌలింగ్‌ చేయడానికి రాగా.. సూర్య తొలి బంతిని సిక్సర్‌గా మలిచాడు. తర్వాతి బంతిని కూడా అలాగే ఆడబోయి డేవిడ్‌ మలన్‌ చేతికి చిక్కాడు. రీప్లేలో బంతి నేలకు తాకినట్లు స్పష్టంగా కనిపించింది. అయితే, ఫీల్డ్‌ అంపైర్‌ సాఫ్ట్‌కాల్‌ పద్ధతిలో ఔటిచ్చాడు. థర్డ్‌ అంపైర్‌ కూడా దాన్ని ఔట్‌గా ప్రకటించడంతో దుమారం రేగింది. కెప్టెన్‌ కోహ్లీతో సహా, పలువురు మాజీలు సైతం థర్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం సూర్యకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. తాను అలా ఔటవ్వడంతో నిరాశ చెందలేదని చెప్పాడు. కొన్ని విషయాలు తన చేతుల్లో ఉండవని, తన పరిధిలో ఉన్నవాటి కోసమే ప్రయత్నిస్తానని తెలిపాడు.

‘మేం గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను బ్యాటింగ్‌ చేయడానికి వెళ్లినప్పుడు ఎలా ఆడాలనే విషయంపై పూర్తి స్పష్టతతో ఉన్నా. ఆర్చర్‌ బౌలింగ్‌ను ఐపీఎల్‌లో గత రెండేళ్లుగా గమనిస్తున్నా. అలాగే ఇతర మ్యాచ్‌ల్లో కొత్త బ్యాట్స్‌మన్‌ క్రీజులోకి వస్తే అతడెలా బంతులు వేయాలనే ప్రణాళికలతో ఉంటాడో.. నేనూ నా ప్రణాళికలతో అలాగే సిద్ధంగా ఉన్నా’ అని సూర్య చెప్పుకొచ్చాడు. ఇక టీమ్‌ఇండియాకు మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేసే అవకాశం దక్కడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నాడు. అనంతరం ఈ సిరీస్‌ కోసం సన్నద్ధమైన తీరును వివరించాడు. ‘ఆటపై నాకున్న ప్రేమనే ఇక్కడిదాకా తీసుకొచ్చింది. టీమ్‌ఇండియాలో ఆడాలనే కోరికతో బాగా కష్టపడ్డా. భారత జట్టులో ఆడాలనేదే నా కోరిక. దాంతో నా చేతిలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకున్నా. అలా నా నైపుణ్యాలు, ఫిట్‌నెస్‌పైనే దృష్టిసారించా. సరైన సమయం వచ్చినప్పుడు నాకు అవకాశం వస్తుందని నమ్మాను. అలా వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటాననే ధీమాతో ఉన్నా’ అని సూర్యకుమార్‌ వివరించాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని