3 నెలల్లో 12 కిలోలు తగ్గా: సూర్య కుమార్‌ - surya kumar yadav says he lost 12 kgs weight during lockdown
close
Published : 16/03/2021 09:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

3 నెలల్లో 12 కిలోలు తగ్గా: సూర్య కుమార్‌

దిల్లీ: లాక్‌డౌన్‌ సమయంలో 3 నెలల్లో 12 కిలోలు తగ్గానని టీమ్‌ఇండియా ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ తెలిపాడు. నిరుడు ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన సూర్యకు ఆదివారం ఇంగ్లాండ్‌తో తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడే అవకాశం లభించింది. ‘‘క్రికెట్‌ మీద ఇష్టం, ప్రేమ నన్ను నడిపిస్తున్నాయి. సరైన దారిలో నడిస్తే లక్ష్యాన్ని అందుకుంటానని తెలుసు. లాక్‌డౌన్‌ మొదట్లో అన్ని రకాల ఆహారం తిన్నా. తీపి, స్వీట్లు, కార్పోహైడ్రేట్లు, అన్నం తీసుకున్నా. అయితే లాక్‌డౌన్‌ సమయాన్ని ఫిట్‌గా తయారయ్యేందుకు ఎందుకు ఉపయోగించుకోవద్దు? అన్న ఆలోచన వచ్చింది. అప్పట్నుంచి తీపి పదార్థాలు మానేశా. అన్నం, పిండి వంటకాలు 90 శాతం తగ్గించా. కార్బొహైడ్రేట్లకు స్వస్తి చెప్పా. జొన్న.. రాగి రొట్టెలు, పప్పు, ఆకు కూరలు, పనీర్‌ మాత్రమే తిన్నా. రోజూ రెండు సార్లు  కసరత్తులు చేశా. గతంలో వారంలో అయిదుసార్లు కసరత్తులు చేసేవాడిని. ఆరంభంలో కొంచెం కష్టంగా అనిపించింది. రాత్రి 7.30 భోజనం చేసి.. 10.30 నుంచి 11 గంటల మధ్య పడుకునేవాడిని. మొదట్లో రాత్రిళ్లు బాగా ఆకలి వేసేది. తర్వాత అలవాటైంది. ఫిట్‌గా మారడం అంత సులువు కాదు.. అసాధ్యమూ కాదని నాకు నేను చెప్పుకునేవాడిని. 3 నెలల్లోనే 12 కిలోలు తగ్గా’’ అని సూర్య లాక్‌డౌన్‌ జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని