పకోడి చేయలేదని.. గడగడలాడించింది! - suryakantham fires on hotel owner
close
Published : 21/09/2020 12:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పకోడి చేయలేదని.. గడగడలాడించింది!

వెండితెరపై గయ్యాళి పాత్రలకు చిరునామా సూర్యకాంతం. వ్యక్తిగతంగా ఆమె మంచి మనసున్న వ్యక్తే అయినప్పటికీ కొన్నిసార్లు కోపంతో బయటకూ ‘గయ్యాళి’గా అరిచిన సందర్భాలున్నాయి. సూర్యకాంతం ఒకసారి షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చి సారథి స్టూడియోలో ఉన్న క్యాంటీన్‌లో సాయంకాలం పకోడి చేయమన్నారు. తీరా సాయంత్రం వచ్చి ‘అందరికీ పకోడీ తీసుకురా’ అని ఆమె ప్రొడక్షన్‌ వాళ్లకు చెబితే.. ఓ వ్యక్తి వచ్చి ‘పకోడి చేయలేదు.. బజ్జీ చేశాం’ అని చెప్పారు. దీంతో ఆ క్యాంటీన్‌ అధికారిపై సూర్యకాంతం మండిపడ్డారట.

‘‘నేను చెప్పినప్పుడు చేస్తానని  ఎందుకన్నావు? చేయలేకపోతే నాకొచ్చి చెప్పాలా లేదా? నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేయడమేంటి? నేను డబ్బు ఇవ్వను నీ ఇష్టం వచ్చిన వాడికి చెప్పుకో. మరీ మాట్లాడావంటే పెద్ద వాళ్లతో చెప్పి నీ క్యాంటీన్‌ ఎత్తించేస్తా’’ అని గట్టిగా మందలించారట. ఈ సంఘటనతో అందరూ ఆశ్చర్యంగా చూస్తుండిపోయారట.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని