అభిమానులపై సుశాంత్‌ సోదరి ప్రశంసలు - sushant singh rajput sister shweta kirti applauds fans
close
Published : 05/05/2021 18:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అభిమానులపై సుశాంత్‌ సోదరి ప్రశంసలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశాన్ని కరోనా సెకండ్‌ వేవ్‌ అల్లకల్లోలం చేస్తోంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడంతో వాళ్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ కరోనా కష్టకాలంలో అటువంటి అభాగ్యులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులే కాదు.. వాళ్ల అభిమానులు కూడా మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు. గతేడాది ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ అభిమానులు కరోనా సమయంలో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసి సోషల్‌ మీడియా ద్వారా తమవంతు సాయం చేస్తున్నారు. కరోనా బాధితులకు ఆక్సిజన్‌, ప్లాస్మా ఇలా అవసరమైనవి అందించేందుకు కృషి చేస్తున్నారు. అంతేకాదు.. ‘సుశాంత్‌కా కిచెన్‌’ పేరుతో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. దీనిపై సుశాంత్‌ సోదరి శ్వేతాసింగ్‌ కీర్తి స్పందించింది. సుశాంత్‌ అభిమానులు చేస్తున్న మంచి పనికి వాళ్లపై ప్రశంసలు కురిపించింది. మీరు వేసిన ముందడుగు చాలా గొప్పదంటూ వాళ్లను పొగడ్తలతో ముంచెత్తింది.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని