సుశాంత్‌ ఆ సినిమాకి రూ.12 కోట్లు అడిగారు..! - sushanth did not agree to the signing amount of Rs 6 crore Says Jaya Saha
close
Updated : 23/09/2020 10:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుశాంత్‌ ఆ సినిమాకి రూ.12 కోట్లు అడిగారు..!

హీరో టాలెంట్‌ మేనేజర్‌ జయ

ముంబయి: యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానాస్పద మృతి కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసును అధికారులు డ్రగ్స్ కోణంలో విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సుశాంత్‌తో సంబంధాలున్న ప్రతిఒక్కర్నీ ఎన్సీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. దీంతో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సుశాంత్‌ టాలెంట్‌ మేనేజర్‌ జయా సాహాని ఎన్సీబీ అధికారులు రెండు రోజులపాటు విచారణ చేశారు. జూన్‌ 5న చివరిసారిగా సుశాంత్‌తో ఓ సినిమా గురించి మాట్లాడానని విచారణలో జయా చెప్పినట్లు పలు జాతీయ పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీంతో ఆమె పనిచేస్తున్న క్వాన్‌(KWAN) టాలెంట్‌ ఏజెన్సీపై అధికారుల చూపు పడింది.

సుశాంత్‌ టాలెంట్‌ మేనేజర్‌గా ఉంటూ ఆయనకి పలు సినిమా ఆఫర్స్‌ తీసుకువస్తుండేది జయ. 2016 నుంచి సుశాంత్‌ టాలెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ఆమె ‘సన్‌చురియా’, ‘కేదార్‌నాథ్‌‌’, ‘చిచ్చోరే’, ‘డ్రైవ్‌’ సినిమాలు హీరోకి వచ్చేలా చేసింది. ‘సన్‌చురియా’ చిత్రానికి రూ.5 కోట్లు తీసుకున్న సుశాంత్‌ ‘కేదార్‌నాథ్‌‌’కి రూ.6 కోట్లు, ‘డ్రైవ్‌’కి రూ.2.25 కోట్లు, ‘చిచ్చోరే’కి రూ.5 కోట్లు, ‘దిల్‌ బెచారా’కి రూ.3.5 కోట్లు పారితోషికంగా అందుకున్నారని ఆమె ఎన్సీబీ అధికారులకు తెలిపినట్లు సమాచారం. అంతేకాకుండా 2016 నుంచి 2019 వరకూ 21 బ్రాండ్స్‌కి సుశాంత్‌తో ఒప్పందం కుదిర్చేలా చేశానని ఆమె విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్‌లో తాను మానసికంగా కుంగుబాటుకు లోనయ్యానని సుశాంత్‌ తనతో చెప్పాడని, ఈ ఏడాది మార్చి నెలలో ఆయన ఇంటికి వెళ్లగా సదరు హీరో ప్రవర్తన చూసి ఆశ్చర్యానికి గురయ్యారట. జయ ఉన్న కొద్ది సమయంలోనే సుశాంత్‌ తన బెడ్‌రూమ్‌లో నుంచి హాల్‌లోకి..  మళ్లీ హాల్‌లో నుంచి బెడ్‌రూమ్‌లోకి ఇలా చాలాసార్లు తిరుగుతూనే ఉన్నారట. కుమార్‌ మంగళ్‌ తెరకెక్కించనున్న ఓ సినిమా గురించి తాను చివరిసారి జూన్‌ 5న సుశాంత్‌తో మాట్లాడానని.. అయితే కథ నచ్చినప్పటికీ మొదట సంతకం చేసిన రూ.6 కోట్లు కాకుండా దానికి బదులు రూ.12 కోట్లు పారితోషికం కావాలని సుశాంత్‌ కోరారని జయ ఎన్సీబీ అధికారులకు వెల్లడించినట్లు సమాచారం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని