సుశాంత్‌ ఆమెకు ప్రపోజ్‌ చేయాలని..! - sushanth planned to propose sara ali khan
close
Published : 06/09/2020 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుశాంత్‌ ఆమెకు ప్రపోజ్‌ చేయాలని..!

ఆసక్తికర విషయాలు తెలిపిన ఫాంహౌస్‌ మేనేజర్

ముంబయి: కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ తన సహనటి సారా అలీ ఖాన్‌కు ప్రపోజ్‌ చేయాలనుకున్నారని నటుడి ఫాంహౌస్‌ మేనేజర్‌ రయీస్‌ వెల్లడించారు. 2018 జనవరిలో సారా పుట్టినరోజు సందర్భంగా ఘనంగా కార్యక్రమం ఏర్పాటు చేసి, తన ఇష్టాన్ని తెలపాలనుకున్నారని పేర్కొన్నారు. జూన్‌ 14న సుశాంత్‌ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన మృతి వెనుక కారణాలను వెలికితీసే క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తను, సుశాంత్‌ పెళ్లి చేసుకోవాలి అనుకున్నట్లు ఇప్పటికే నటి రియా చక్రవర్తి చెప్పారు. దీనికి ముందు 2018లో సుశాంత్‌.. సారాను ఇష్టపడ్డారని ఆయన ఫాంహౌస్‌ మేనేజర్‌ తాజాగా ఆంగ్ల మీడియాతో అన్నారు.

‘సారా మేడమ్‌ ఇతరులతో చాలా సౌమ్యంగా వ్యవహరిస్తుంటారు. ఆమె ఓ హీరోయిన్‌లా ప్రవర్తించేవారు కాదు. సాధారణ యువతిలా ఉండేవారు. ఫాంహౌస్‌లో పనిచేసే వారిని ఆంటీ, అంకుల్‌ అని పిలిచేవారు. సారా నన్ను రయీస్‌ భాయ్‌ అనేవారు. ఆమె సిబ్బందిని ఎంతో గౌరవించేవారు. సుశాంత్‌ కూడా తన వద్ద పనిచేసే వారిని సొంత వ్యక్తుల్లా చూసుకునేవారు. 2018 డిసెంబరులో సుశాంత్‌, సారా తమ స్నేహితులతో కలిసి థాయిలాండ్‌ ట్రిప్‌ వెళ్లారు. తిరిగి భారత్‌కు రాగానే ముంబయి విమానాశ్రయం నుంచి సుశాంత్‌, సారా నేరుగా ఫాంహౌస్‌కు వచ్చారు. అప్పుడు సమయం రాత్రి 11 గంటలు. స్నేహితులతో కలిసి ఇద్దరు మూడు రోజులు ఇక్కడే ఉన్నారు’.

‘సుశాంత్‌ 2019 జనవరిలో సారాతో కలిసి డామన్‌ ట్రిప్‌కు ప్లాన్‌ చేశారు. అక్కడ ఆమెకు ఓ కానుక ద్వారా ప్రపోజ్‌ చేయాలి అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ట్రిప్‌కు వెళ్లలేదు. ఆపై కేరళకు వెళ్లడానికి ప్రయత్నించారు. అది కూడా జరగలేదు. 2019 మార్చి సమయంలో ఇద్దరు విడిపోయినట్లు నాకు తెలిసింది. జనవరి 2019 తర్వాత సారా ఫాంహౌస్‌కు రాలేదు’.

‘సుశాంత్‌ ఫాంహౌస్‌లోని పనివాళ్లతో కలిసి క్రికెట్‌ ఆడేవారు. లాక్‌డౌన్‌కు ముందు ఆయన ఫాంహౌస్‌కి రావాలని, కొన్నాళ్లు ఇక్కడే సమయం గడపాలని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో రావట్లేదని చెప్పారు’ అని పేర్కొన్నారు. సుశాంత్‌, సారా ‘కేదార్‌నాథ్‌’ సినిమా కోసం కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని