T20 World Cup 2021:ఈ నాలుగు జట్లు సెమీస్ చేరుతాయి: ఆకాశ్‌ చోప్రా - t20 world cup 2021 aakash chopra predicts four semi-finalists for iccs t20 tournament
close
Published : 14/09/2021 20:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

T20 World Cup 2021:ఈ నాలుగు జట్లు సెమీస్ చేరుతాయి: ఆకాశ్‌ చోప్రా

(Photo: Aakash Chopra)

ఇంటర్నెట్ డెస్క్‌: యూఏఈ, ఒమన్‌ వేదికగా అక్టోబరు 17న ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ కోసం క్రికెట్‌ ప్రేమికులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ మెగా టోర్నీలో విజేతగా నిలవడానికి అన్ని జట్లు తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రధాన దేశాలన్నీ జట్లను ప్రకటించాయి. అయితే, ఏ జట్టు విజేతగా నిలుస్తుంది, ఏ ఏ జట్లు విజయం సెమీస్‌కు చేరుతాయి అనే విషయాలపై అప్పుడే చర్చ మొదలైంది. ఈ అంశాలపై చాలా మంది మాజీ క్రికెటర్లు విశ్లేషణలు చేస్తున్నారు. టీమ్ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా సైతం ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఆకాశ్‌ చోప్రా ట్విటర్‌లో అభిమానులతో ముచ్చటిస్తుండగా... ‘మీ అంచనా ప్రకారం.. టీ20 ప్రపంచ కప్‌ సెమీ ఫైనల్‌కు చేరే నాలుగు జట్లు ఏవి’ అని ఓ నెటిజన్‌  ప్రశ్నించాడు.  దీనికి బదులుగా.. ‘ఇండియా, పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్’ అని చోప్రా సమాధానమిచ్చాడు. ఐపీఎల్-14 సీజన్‌లో ఏ జట్టు విజేతగా నిలుస్తుందని ఓ నెటిజన్ అడగ్గా.. ‘ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫైనల్‌కి చేరుతాయి’ అని సమాధానమిచ్చాడు.  

 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని