ఆ సన్నివేశాల్లో  వాళ్లిద్దరూ భయపడ్డారు - taapsee pannu about her role in haseen dilruba
close
Published : 30/06/2021 11:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ సన్నివేశాల్లో  వాళ్లిద్దరూ భయపడ్డారు

ముంబయి: ‘‘ఒకప్పుడు నా వద్దకు వచ్చిన కథల్లోంచి ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు అన్నీ నాకు నచ్చిన కథలే వస్తున్నాయి. వాటిల్లోంచి ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది’’అంటోంది తాప్సి. ఆచితూచి పాత్రల్ని ఎంచుకుంటూ ముందుకెళుతోందీ భామ. నాలుగైదు వైవిధ్యమైన చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ‘‘వరసగా కొత్త రకమైన పాత్రలు నన్ను వెత్తుక్కుంటూ వస్తున్నాయి. వాటికి సమయం సరిపోవడం లేదు. అలాగని నా వద్దకు వచ్చే మంచి కథల్ని వదలబుద్ధి కావడం లేదు. సంవత్సరంలో 300 రోజులు కష్టపడటానికి నేను సిద్ధంగానే ఉన్నాను’’అని చెబుతోంది తాప్సి. ఆమె నటించిన ‘హాసీన్‌ దిల్‌ రూబా’ జులై 2న ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. భర్త హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొనే భార్య పాత్రలో ఆమె నటిస్తోంది. భర్త చనిపోయాకా మరో వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో విక్రాంత్‌ మస్సే, హర్షవర్ధన్‌ రాణే కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో కొన్ని శృంగార సన్నివేశాలు ఉన్నాయట. అవి చేయడానికి విక్రాంత్, హర్షవర్థన్‌లు భయపడ్డారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తాప్సి పంచుకుంది. ‘‘నేను ఇబ్బంది పడకుండా నటించాను కానీ వాళ్లిద్దరూ భయపడ్డారు. ఆమె ఏం చేస్తుంది అనుకున్నారో లేక వేరే కారణం ఉందో తెలియదు కానీ భయపడినట్లు నాకు అర్థమైంది’’అని చెప్పింది తాప్సి. మీ నిజ జీవిత భాగస్వామికి ఇలాంటి శృంగార సన్నివేశాలు చేస్తున్నట్టు ముందే చెబుతారా? అంటే ‘‘లేదు. వాటి గురించి నేను చెప్పను. ఎందుకంటే అది నా వృత్తి జీవితం. వ్యక్తిగత జీవితానికి దూరంగా వృత్తి జీవితం ఉండాలని భావిస్తుంటాను. అతడి పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించిన విషయాల్లో నా అనుమతి తీసుకోవాలని కూడా నేను కోరుకోను. అలాగే నా నుంచి కోరుకోకూడదు అనుకుంటా’’అని చెప్పింది తాప్సి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని