బ్యాట్‌ పట్టా..హిట్టు కొడతా: తాప్సీ - taapsee pannu is down the line for shabaash mithu shares photo from batting practice
close
Published : 30/03/2021 18:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాట్‌ పట్టా..హిట్టు కొడతా: తాప్సీ

ముంబయి: బాలీవుడ్‌లో వరుసపెట్టి మహిళా ప్రాధాన్య సినిమాలు చేస్తూ నటి తాప్సీపన్ను ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ బయోపిక్‌ ‘శభాష్‌ మిథు’లో నటించేందుకు సన్నద్ధమౌతున్నారు. అందుకోసం బ్యాటు పట్టుకుని నెట్స్‌లో విపరీతంగా శ్రమిస్తుంది.  కవర్‌ డ్రైవ్‌ వంటి సంప్రదాయ క్రికెట్‌ షాట్లను ముమ్మరంగా ప్రాక్టీసు చేస్తోంది. తన రోజూవారి శిక్షణ ఫొటోలను ఇన్‌స్టా ద్వారా నెటిజన్లతో పంచకుంటుంది. భారత మాజీ మహిళా క్రికెటర్‌ నోషిన్‌ ఐ ఖాదిర్‌ శిక్షణలో రాటుదేలుతుంది. ఇక మిథాలిరాజ్‌ భారత మహిళల క్రికెట్‌ జట్టుకు సుధీర్ఘకాలం కెప్టెన్‌గా కొనసాగి ఇటీవలే రిటైర్మెంట్‌ తీసుకున్నారు.  ప్రస్తుతం తాప్సీ ‘శభాష్ మిథు’తో పాటు ‘రష్మీ రాకెట్‌’ అనే మరో క్రీడా నేపథ్య సినిమాలో నటిస్తుండటం విశేషం. ప్రస్తుతం వరుస చిత్రాలతో బాలీవుడ్‌లో ఆమె బిజీ హీరోయిన్‌గా మారారు. తాప్సీ బ్యాట్‌ పట్టి నెట్స్‌లో ప్రాక్టీసు చేస్తున్న దృశ్యాలను మీరూ చూసేయండి!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని