Taapsee: ముద్దు సీన్లతో ఇబ్బందిపడ్డా - taapsee pannu recalls her awkward experience watching explicit scenes with family
close
Published : 03/07/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Taapsee: ముద్దు సీన్లతో ఇబ్బందిపడ్డా

ముంబయి: నటి తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘హసీనా దిల్‌రుబా’. వినీల్‌ మాథ్యూ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రాంత్‌, హర్షవర్థన్‌ కీలకపాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న తాప్సీ సినిమా షూట్‌ సమయంలో తన అనుభవాలను పంచుకున్నారు. షూట్‌ ఎంతో సరదాగా సాగిందని.. కాకపోతే ముద్దు, శృంగార తరహా సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు తనతోపాటు విక్రాంత్‌, హర్షవర్థన్‌ కూడా ఇబ్బందిపడ్డారని ఆమె అన్నారు.

ఇక కళాశాలలో చదువుకునే సమయంలో కుటుంబసభ్యులతో కలిసి హాలీవుడ్‌ సినిమాలు చూడడానికి ఇబ్బంది పడినట్లు తాప్సి తెలిపారు. ‘నేను టీనేజీలో ఉన్నప్పుడు మా ఇంట్లో ఒకే టీవీ ఉండేది. మా నాన్నకు హాలీవుడ్‌ సినిమాలు చూడడమంటే ఇష్టం. దాంతో ఇంట్లో ఉన్న వాళ్లందరూ నాన్నతోపాటు కూర్చొని అవే సినిమాలు చూసేవాళ్లం. అలా మేమంతా సరదాగా గడిపేవాళ్లం. కానీ ఆ సినిమాల్లో ప్రేమ, ముద్దు సన్నివేశాలు వస్తే.. టీవీ ముందు కూర్చున్న మేమంతా కాస్త ఇబ్బందికి గురయ్యేవాళ్లం. దాంతో, ఇంట్లో పెద్దవాళ్లు.. మంచినీళ్లు తీసుకురమ్మని నన్ను కిచెన్‌లోకి పంపించేసేవాళ్లు. కుటుంబంతో కలిసి కొన్ని సన్నివేశాలు వీక్షించడం ఎంతైనా కష్టంగానే ఉంటుంది’ అని తాప్సీ తెలిపారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని