Cinemanews: బాలీవుడ్‌పై తాప్సీ అసంతృప్తి - taapsee pannu unhappy with pay disparity in bollywood
close
Published : 06/07/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinemanews: బాలీవుడ్‌పై తాప్సీ అసంతృప్తి

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య అసమానతల విషయమై ఏళ్లుగా చర్చ సాగుతూనే ఉంది. కానీ, బహిరంగంగా ఎవరూ స్పందించేందుకు సాహసం చేయరు. కాగా.. సొట్టబుగ్గల సుందరి తాప్సీ ఆ విషయంపై ఎప్పటిలాగే తనదైన శైలిలో కుండబద్దలు కొట్టింది. బాలీవుడ్‌లో నటుల(ఆడ, మగ) మధ్య అసమానతలు ఎక్కువగా ఉన్నాయని ఆమె వాపోయింది. అది ముఖ్యంగా పారితోషికం విషయంలో మరీ స్పష్టంగా కనిపిస్తుందని ఆమె చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఇండస్ట్రీలో నెలకొన్న  అసమానతలపై స్పందించింది. ఇటీవల ఒక సినిమాలో సీతపాత్ర పోషించేందుకు బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌ కరీనాకపూర్‌ రూ.12కోట్లు డిమాండ్‌ చేసిందని వార్తలు వినిపించాయి. ఇది సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ క్రమంలోనే హీరోల రెమ్యునరేషన్‌పై స్పందించని వాళ్లు ఒక హీరోయిన్‌ పారితోషికం విషయంలో ఎందుకింత రచ్చ చేస్తున్నారంటూ తాప్సీ మండిపడింది.

‘‘ఇండస్ట్రీలో ఎవరైనా మహిళా నటులు పారితోషికం ఎక్కువగా అడిగితే అది పెద్ద సమస్యగా మారిపోతుంది. అదే.. ఎవరైనా హీరో రెమ్యునరేషన్‌ పెంచితే మాత్రం అది ‘అతని సక్సెస్‌’గా అభివర్ణిస్తారు. నాతో పాటు సినిమా కెరీర్‌ ప్రారంభించిన వాళ్లు ఇప్పుడు నాకంటే 3-4రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నారు. గుర్తింపు విషయంలోనూ అదే తీరు. హీరోలకు స్టార్‌డమ్‌ వచ్చిన సమయంలో హీరోయిన్లకు గుర్తింపు రావడం లేదు. ఈ వ్యత్యాసం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రేక్షకులు కూడా పురుష నటులతో పోలిస్తే మహిళా నటులను తక్కువగానే అభిమానిస్తారు. ఇప్పటికీ మేం బడ్జెట్‌ విషయంలో ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. మహిళా ప్రాధాన్యమున్న సినిమాలకు ఎక్కువగా బడ్జెట్‌ పెట్టేందుకు ఎవరూ ముందుకు రారు. ఎందుకంటే స్టార్‌ హీరోల సినిమాలతో పోల్చితే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలకు రాబడి తక్కువగా ఉంటుందని వాళ్ల భావన. వీటన్నింటికీ ప్రేక్షకులే ప్రధాన కారణం’’ అని తాప్సీ పేర్కొంది.

తెలుగులో ‘ఝుమ్మందినాదం’ చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైందీ దిల్లీ ముద్దుగుమ్మ తాప్సీ. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో ఆమె ఎక్కువగా బాలీవుడ్‌ చిత్రాలకే పరిమితమవుతోంది. ప్రస్తుతం.. నటి తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘హసీన్‌ దిల్‌రుబా’ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోంది. దీంతో పాటు క్రీడా నేపథ్యంలో సాగే రెండు సినిమాల్లో ఆమె నటిస్తోంది. భారత మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ జీవిత కథ ఆధారంగా ‘శభాష్‌ మిథూ’, స్ప్రింటర్‌ రష్మి బయోపిక్‌గా ‘రష్మి రాకెట్‌’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని