close

తాజా వార్తలు

Published : 29/11/2020 14:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆలియా భట్‌ కలల నివాసాన్ని చూద్దామా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌లో స్టార్ ‌హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని, త్వరలో టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది ఆలియా భట్‌. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌ సరసన ఈ చిన్నది సందడి చేయనుంది. దీంతోపాటు బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘బ్రహ్మాస్త్ర’లోనూ ఆలియా భట్‌ నటిస్తోంది. ఇందులో ఆమె తన ప్రియ స్నేహితుడు రణ్‌బీర్‌తో ఆడిపాడనుంది. రణ్‌బీర్‌ కపూర్‌తో ఎక్కువ సమయం గడపాలని ఏకంగా ఆయన ఉన్న అపార్ట్‌మెంట్‌లోనే ఓ ఫ్లాట్‌ని కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదే నిజమైతే కొన్ని సంవత్సరాల క్రితం ఎంతో ఇష్టపడి కొనుక్కున్న జూహూలోని ఫ్లాట్‌కు ఆలియా దూరంగా ఉండొచ్చు. దీంతో ఆలియాభట్‌ సొంతింటి గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు జూహూలోని ఫ్లాట్‌ ఎలా ఉంటుంది? దాని ధర ఎంత ఉండొచ్చు? ఆమె‌ ఆ ఫ్లాట్‌ను తన అభిరుచికి అనుగుణంగా డిజైన్‌ చేయించుకుందని గతంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఒకసారి ఆమె ఇంటిపై లుక్కేద్దాం. దీని కోసం గతంలో ఆలియా షేర్ చేసిన వీడియోలను చూస్తే మనకు తెలిసిపోతుంది కదా!Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన