తమన్నా నా సీనియర్‌: పూజాహెగ్డే - tamannaah bhatia was my senior in school says pooja
close
Published : 11/03/2021 20:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమన్నా నా సీనియర్‌: పూజాహెగ్డే

హైదరాబాద్‌: చదువుకునే రోజుల్లో మిల్కీ బ్యూటీ తమన్నా తనకు సీనియర్‌ అని నటి పూజాహెగ్డే తెలిపారు. ‘రాధేశ్యామ్‌’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రాలతోపాటు అటు బాలీవుడ్‌లోనూ వరుస ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తూ కెరీర్‌లో దూసుకెళ్తున్నారు నటి పూజా. తాజాగా ఆమె ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన స్కూల్‌ డేస్‌ గురించి స్పందించారు. స్కూల్‌లో ఉన్నప్పుడు తాను త్వరగా ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదని పూజా తెలిపారు.

‘‘నేను-తమన్నా ఒకే స్కూల్‌లో చదువుకున్నాం. ఆమె నాకు సీనియర్‌. సంప్రదాయ దుస్తులైనా, పాశ్చాత్య దుస్తులైనా.. తమన్నా చాలా అందంగా ఉంటారు. స్కూల్‌లో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ ఆమె డ్యాన్స్‌ చేసేది. ఆమె అందరితోనూ చక్కగా కలిసిపోయేది. అందర్నీ ఒకేలా చూసేది. స్నేహితుల్ని చేసుకునేది. తమన్నాలోని ఆ కలివిడితనమే నాకెంతో నచ్చింది.’’ అని నటి పూజాహెగ్డే తెలిపారు.

‘సర్కస్‌’, ‘ఆచార్య’ షూట్స్‌తో ప్రస్తుతం బిజీగా ఉంటున్నారు నటి పూజాహెగ్డే. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆచార్య’లో చెర్రీకి జంటగా పూజా కనిపించనున్నారు. మరోవైపు ‘సీటిమార్‌’ విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు నటి తమన్నా. దీనితోపాటు ఆమె ‘గుర్తుందా శీతాకాలం’, ‘ఎఫ్‌-3’, ‘అంధాధున్‌’ రీమేక్‌ చిత్రీకరణల్లో పాల్గొంటున్నారు తమన్నా.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని