కరోనాతో సినీ దర్శకుడు మృతి - tamil filmmaker thamira dies due to covid
close
Published : 27/04/2021 23:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాతో సినీ దర్శకుడు మృతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి మరో సినీ ప్రముఖుడిని బలి తీసుకుంది. ప్రముఖ కోలీవుడ్‌ సినీ దర్శకుడు తమిర (53) కరోనాతో మృతి చెందారు. 20 రోజుల క్రితం ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. చికిత్స కోసం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. తీసుకున్నప్పటికీ వైరస్‌ మహమ్మారి నుంచి కోలుకోలేకపోయారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన ఆస్పత్రిలోనే మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. బాలచందర్‌, భారతీరాజ వంటి దిగ్గజాలతో కలిసి తమిర పనిచేశారు. ఇటీవల హాస్యనటుడు వివేక్‌ను కోల్పోయిన తమిళ పరిశ్రమ ఇంకా ఆ విషాదం నుంచి కోలుకోనేలేదు. తాజాగా తమిర మరణ వార్త ఇండస్ట్రీని మరింత కుంగదీసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని