‘సర్కారు వారి పాట’ హక్కులకు డిమాండ్‌ - tamil satellite rights of Sarkaru Vaari Paata sold for huge amount
close
Published : 03/11/2020 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సర్కారు వారి పాట’ హక్కులకు డిమాండ్‌

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ ఇప్పుడిప్పుడే షూటింగ్‌ పనులు జరుపుకుంటోంది. కాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌కు సంబంధించిన ఓ వార్త తెగ ప్రచారం అవుతోంది. సినిమా తమిళ శాటిలైట్‌ హక్కుల్ని ఓ ప్రముఖ ఛానల్‌ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం. చిత్రానికి డిమాండ్‌ ఉండటంతో సదరు ఛానెల్‌ ముందుగానే హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు. మరి ఇందులో ఏ మాత్రం నిజం ఉందో తెలియాలంటే దర్శక, నిర్మాతలు స్పందించాల్సిందే. సాధారణంగా మహేశ్‌ సినిమా విడుదలకు ముందు శాటిలైట్‌, డిజిటల్‌ హక్కుల బిజినెస్‌ పరంగా దాదాపు రూ.150 కోట్ల వరకు రాబడుతుందని టాక్‌.

‘సరిలేరు నీకెవ్వరు’ హిట్‌ తర్వాత మహేశ్‌ ‘సర్కారు వారి పాట’కు సంతకం చేశారు. ‘గీత గోవిందం’ ఫేం పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేశ్‌ కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్‌, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. ఎస్‌. తమన్‌ బాణీలు సమకూరుస్తున్నారు. మరోపక్క మహేశ్‌ నిర్మాతగా అడివిశేష్‌ కథానాయకుడిగా ‘మేజర్‌’ సినిమా రూపుదిద్దుకుంటోంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని