ఎస్పీబీకి పద్మవిభూషణ్‌ తెలుగు జాతికి గర్వకారణం - tanikella bharani on padma vibhushan award to sp balu
close
Published : 27/01/2021 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎస్పీబీకి పద్మవిభూషణ్‌ తెలుగు జాతికి గర్వకారణం

హైదరాబాద్‌: దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మవిభూషణ్‌ అవార్డు రావడం తెలుగుజాతికి, గాయక కుటుంబానికి గర్వకారణమని ప్రముఖ సినీ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి అన్నారు. బాలుతో ‘మిథునం’ చిత్రం నిర్మించడం, అది ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చిపెట్టడం సంతోషంగా ఉందన్నారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సంకీర్తన గ్రూప్‌, ఎలివేట్స్‌ గ్రూప్‌ సంయుక్తంగా హైదరాబాద్‌ ఎన్‌కెఎం హోటల్‌లో నిర్వహించిన సింగర్‌ మీట్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు.

ఈ సందర్భంగా భరణిని నిర్వహకులు ఘనంగా సత్కరించారు. కరోనా ప్రపంచానికి ఎంతో నేర్పిందన్నారు. ప్రపంచమంతా నాదే అనే దురహంకారులకు చెంపపెట్టు కరోనా అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రకృతిని, పర్యావరణ సమతుల్యం కాపాడకపోతే త్వరలోనే ప్రపంచ వినాశం తప్పదనే సత్యాన్ని కరోనా నేర్పిందన్నారు. ఇంట్లో గృహిణులుగా ఉంటూ....కూని రాగాలు పలికే వారికి సాంకేతికత కారణంగా ప్రపంచ వ్యాప్తంగా తమ గొంతుకను వినిపించే సౌలభ్యం కలుగుతోందన్నారు. గొప్ప గాయకులు కాకపోయినా.. తమ సంగీత అభిరుచులకు అనుగుణంగా పాటలు పాడుకునే వారు ఇలా వేదికపై చక్కగా పాడటం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 45 మంది గాయనీ, గాయకులు తెలుగు రాష్ట్రాల నుంచే కాక పుణె నుంచి వచ్చిన వారు సైతం తమ మధురమైన కంఠస్వరంతో పలు భక్తి, సినీ గీతాలను అలపించి అలరించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని