టైగర్‌తో తార - tara sutaria pair with tiger shroff
close
Published : 31/10/2020 16:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టైగర్‌తో తార

ముంబయి: బాలీవుడ్‌ యువ కథానాయకుల్లో యాక్షన్‌ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టైగర్‌ ష్రాఫ్‌. కండలు తిరిగిన దేహంతో తెరపై టైగర్‌ చేసే పోరాటాలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. టైగర్‌ హీరోగా పరిచయమైన చిత్రం హీరో పంటి. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘హీరోపంటి 2’ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో నాయికగా తారా సుతారియాని ఖరారు చేసింది చిత్రబృందం. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా పంచుకున్నాడు టైగర్‌.

‘హీరో పంటి’ కుటుంబంలోకి తారాసుతారియాకు స్వాగతం’ అంటూ ట్వీట్‌ చేశాడు. టైగర్‌ నటించిన ‘స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది తార. మళ్లీ రెండేళ్ల తర్వాత ఈ జంట కలిసి నటించబోతుంది. అహ్మద్‌ఖాన్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని