మ‌హేశ్‌బాబుతో చేద్దామ‌న్నారు కానీ త‌రుణ్‌తో.. - tarun
close
Published : 27/05/2021 18:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మ‌హేశ్‌బాబుతో చేద్దామ‌న్నారు కానీ త‌రుణ్‌తో..

ఇంట‌ర్నెట్ డెస్క్‌: త‌రుణ్ హీరోగా.. న‌టుడు, ద‌ర్శకుడు కాశీ విశ్వ‌నాథ్ తెర‌కెక్కించిన సినిమా ‘నువ్వు లేక నేను లేను’. 2002లో విడుద‌లైన‌ ఈ ప్రేమక‌థా చిత్రం ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంది. న‌టీన‌టుల‌కు, ద‌ర్శ‌కుడికి మంచిపేరు తీసుకొచ్చింది. మరి తరుణ్ స్థానంలో మ‌హేశ్ బాబు న‌టించి ఉంటే ఎలా ఉండేది? ఎందుకంటారా.. ఈ సినిమా క‌థ పూర్త‌య్యాక‌ మ‌హేశ్ బాబుతో చేద్దామా అని నిర్మాత సురేశ్ బాబు ద‌ర్శ‌కుడ్ని అడిగారు. దానికి విశ్వ‌నాథ్ ఇలా స‌మాధానం ఇచ్చారు. ‘‘మ‌హేశ్ అంటే చాలా ఆల‌స్య‌మ‌వుతుంది. త‌నతో సినిమా చేసేందుకు చాలామంది క్యూలో ఉంటారు. ఇప్ప‌టికే నాకు లేట్ అయింది. ఈ క‌థ‌కి త‌రుణ్ స‌రిగ్గా స‌రిపోతాడు. పైగా ‘నువ్వే కావాలి’ చిత్రంతో హిట్ అందుకున్నాడు’’ అని సురేశ్ బాబుకి చెప్పిన‌ట్టు ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశారు విశ్వ‌నాథ్‌. అలా మ‌హేశ్ స్థానంలో త‌రుణ్ ఈ ప్రాజెక్టులో అడుగుపెట్టి విజ‌యం అందుకున్నాడు.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని