ఐదో రోజు కొనసాగుతున్న తెదేపా ఆందోళనలు - tdp protest for supporting frontline warriors
close
Updated : 26/07/2020 16:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐదో రోజు కొనసాగుతున్న తెదేపా ఆందోళనలు

అమరావతి: వైకాపా ప్రభుత్వంపై సమరభేరి పేరిట తెదేపా వారం రోజుల ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఐదో రోజున కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు సంఘీభావంగా తెదేపా శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో తెదేపా నేతలు ఒక్కరోజు నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే ఇళ్లలో తెదేపా కార్యకర్తలు దీక్షలకు దిగారు. పాత్రికేయులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌లో చేర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఫ్రంట్‌లైన్‌వారియర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని, ఒకవేళ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ మృతి చెందితే.. వారి కుటుంబాలకు రూ. 50లక్షలు ఇవ్వాలని తెదేపా డిమాండ్‌ చేస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని