వారికి జ్ఞానం ప్రసాదించాలని వేడుకున్నా: అశోక్‌ గజపతి - tdp senior leader ashok gajapathiraju comments
close
Updated : 15/06/2021 13:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారికి జ్ఞానం ప్రసాదించాలని వేడుకున్నా: అశోక్‌ గజపతి

విజయనగరం: రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు జ్ఞానం ప్రసాదించాలని పైడితల్లి అమ్మవారిని వేడుకున్నట్లు తెదేపా సీనియర్‌ నేత, మాన్సాస్‌ ట్రస్టు మాజీ ఛైర్మన్ అశోక్‌ గజపతిరాజు అన్నారు. మాన్సాస్‌ ట్రస్టు, సింహాచలం దేవస్థానం ఛైర్‌పర్సన్‌గా సంచైత నియామకం చెల్లదంటూ హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో విజయనగరంలోని పైడితల్లి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. 

అనంతరం అశోక్‌ గజపతిరాజు మీడియాతో మాట్లాడారు. రెండేళ్ల కాలంలో ఎన్నో అలజడులు సృష్టించారని.. తనపై కక్ష గట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహాచలం గోశాలలో గోవులను హింసించి చంపేశారని.. మాన్సాస్‌ సంస్థను అనేక రకాలుగా నష్టపరిచారని ఆరోపించారు. ట్రస్టు ఆధ్వర్యంలోని 105 ఆలయాల్లో ఏమేం జరిగాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని