మూడో స్థానానికి పడిపోయిన టీమ్‌ఇండియా - team india droped to third place in odi annual ranking chart
close
Published : 04/05/2021 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మూడో స్థానానికి పడిపోయిన టీమ్‌ఇండియా

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా వన్డే ఫార్మాట్‌లో మూడో స్థానానికి పడిపోయింది. ఇంతకుముందు రెండో స్థానంలో ఉన్న భారత జట్టు ఇప్పుడు ఒక స్థానం కిందకు జారింది. మరోవైపు టీ20 ఫార్మాట్‌లో ఇంగ్లాండ్‌ 277 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. టీమ్‌ఇండియా 272 పాయింట్లతో రెండో స్థానం, 263 పాయింట్లతో న్యూజిలాండ్‌ మూడో స్థానంలో నిలిచాయి. ఇక వన్డేల్లో న్యూజిలాండ్‌ 121 పాయింట్లతో టాప్‌లో నిలవగా.. ఆస్ట్రేలియా 118, టీమ్‌ఇండియా 115 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా టెస్టుల్లో 120 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు న్యూజిలాండ్‌ 118, ఆస్ట్రేలియా 113 పాయింట్లతో రెండు, మూడులో ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి సోమవారం విడుదల చేసిన జాబితాలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని