ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా ఎంపిక - team india for odi series announced
close
Updated : 19/03/2021 11:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా ఎంపిక

దిల్లీ: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ అనంతరం ఆ జట్టుతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌ కోసం బీసీసీఐ కొద్దిసేపటి క్రితమే భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో తొలిసారిగా సూర్యకుమార్ యాదవ్‌, కృనాల్‌ పాండ్య, ప్రసిద్ధ్‌ కృష్ణకు స్థానం కల్పించడం విశేషం. పుణె వేదికగా మార్చి 23, 26, 28 తేదీల్లో ఈ వన్డేలు జరగనున్నాయి. మరోవైపు గతరాత్రి జరిగిన నాలుగో టీ20లో భారత్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. శనివారం జరగబోయే ఐదో మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారిదే టీ20 సిరీస్‌. ఈ మ్యాచ్‌లో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌లో బ్యాటింగ్‌ చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌(57; 31 బంతుల్లో 6x4, 3x6) అద్భుత ప్రదర్శన చేశాడు.

భారత జట్టు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌(వికెట్‌ కీపర్‌), హర్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, రిషభ్‌‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, నటరాజన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, శార్ధూల్‌ ఠాకూర్‌, సిరాజ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, చాహల్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని