పాండ్య బ్రదర్స్‌.. ధైర్యంగా ఉండండి - team india fraternity condolences hardik and krunal pandya
close
Published : 17/01/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాండ్య బ్రదర్స్‌.. ధైర్యంగా ఉండండి

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్యల తండ్రి హిమాన్షు పాండ్య శనివారం ఉదయం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాండ్య బ్రదర్స్‌కు ధైర్యం చెబుతూ మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు ట్విటర్‌ వేదికగా సానుభూతి వ్యక్తం చేశారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, యువీ, ఇర్ఫాన్‌ పఠాన్‌, హనుమ విహారి, ఆకాశ్‌చోప్రా, ముంబయి ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా పలువురు ఆటగాళ్లు హిమాన్షు పాండ్యని కలిసిన క్షణాలను గుర్తు చేసుకున్నారు.

హార్దిక్‌, కృనాల్‌ పాండ్యల తండ్రి మరణవార్త కలచి వేసింది. హిమాన్షు గారితో పలుమార్లు మాట్లాడాను. ఎప్పుడూ సంతోషంగా ఉండే వ్యక్తి. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి. మీరిద్దరూ ధైర్యంగా ఉండండి - విరాట్‌ కోహ్లీ

ఈ వార్త తెలిసి బాధపడ్డాను. పాండ్య సోదరులకు ప్రగాఢ సానుభూతి. ఈ కష్ట సమయంలో ఆ భగవంతుడే ధైర్యాన్నివ్వాలి - సచిన్‌ తెందూల్కర్‌

హార్దిక్‌, కృనాల్‌.. మీ నాన్న మరణవార్త తెలిసి బాధగా ఉంది. మీకూ, మీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. జాగ్రత్తగా ఉండండి- యువరాజ్‌ సింగ్‌

పాండ్య సోదరుల తండ్రి హిమాన్షు గారిని తొలిసారి మోతిభాగ్‌లో కలిశాను. తన ఇద్దరు కుమారులు మంచి క్రికెట్‌ ఆడాలని ఆయన ఎంతో పరితపించేవారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి - ఇర్ఫాన్‌ పఠాన్‌

మీ నాన్న గురించి ఈ వార్త తెలియడం బాధగా ఉంది. హార్దిక్‌, కృనాల్‌ ధైర్యంగా ఉండండి. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి - హనుమ విహారి

హార్దిక్‌, కృనాల్‌కు ప్రగాఢ సానుభూతి. వాళ్లకెంతో నమ్మకమైన వ్యక్తిని కోల్పోయారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా - ఆకాశ్‌ చోప్రా

చిన్న వయసులోనే హార్దిక్‌, కృనాల్‌ పాండ్యలను ముంబయి జట్టులోకి తీసుకోవడంపై చాలా మంది విమర్శించారు. అయితే ఇప్పటివరకు వాళ్లిద్దరూ ఏం సాధించారో చూడటం గొప్పగా ఉంది. వాళ్ల తండ్రి హిమాన్షు గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి - ముంబయి ఇండియన్స్‌

ఇదీ చదవండి

పాండ్య సోదరులకు పితృ వియోగంమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని