కోహ్లీసేన జోష్‌! టీ20లకు సన్నద్ధం - team india preparation for t20s
close
Published : 10/03/2021 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీసేన జోష్‌! టీ20లకు సన్నద్ధం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో 5టీ20ల సిరీసుకు టీమ్‌ఇండియా వేగంగా సన్నద్ధమవుతోంది. కోచ్‌ రవిశాస్త్రి, సహాయ సిబ్బంది ఆధ్వర్యంలో క్రికెటర్లు నెట్స్‌లో సాధన చేస్తున్నారు. పొట్టి క్రికెట్‌ సిరీసులో అదరగొట్టాలని తపిస్తున్నారు. శుక్రవారం తొలి మ్యాచ్‌ ఉండటంతో మైదానంలో విపరీతంగా కసరత్తులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్‌ చేసింది. ‘సన్నద్ధత ముగిసింది. 12న మైదానంలోకి అడుగు పెట్టేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నా’ అంటూ పాండ్య అంటున్నాడు.

టీమ్‌ఇండియా యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, కీలక ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ జట్టులో చేరడంతో శిబిరం సందడిగా కనిపిస్తోంది. వారితో పాటు భువనేశ్వర్‌ కుమార్‌, శిఖర్‌ ధావన్‌, ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రోహిత్‌ శర్మ, యుజ్వేంద్ర చాహల్‌, నవదీప్‌ సైని, శార్దూల్‌ ఠాకూర్‌ మంచి జోష్‌లో కనిపించారు. రిషభ్‌ పంత్‌, విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ చేశారు. భారీ షాట్లు సాధన చేశారు. ఇక కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, క్యాచులు సాధన చేయడం గమనార్హం.

హార్దిక్‌ పాండ్య పూర్తిగా కోలుకున్నట్టు కనిపిస్తోంది. నెట్స్‌లో భారీ షాట్లు సాధన చేశాడు. అతడి ప్రాక్టీస్‌ను రవిశాస్త్రి, కెప్టెన్‌ కోహ్లీ దగ్గరుండి పరిశీలించారు. ఏడాది కాలంగా పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేయని పాండ్య ఇప్పుడు మునుపటి వేగంతో బంతులు విసురుతున్నట్టు కనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీసులో పరిమితంగా బంతులు విసిరిన అతడు ఇంగ్లాండ్‌ టీ20 సిరీసులో పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేస్తాడని అనిపిస్తోంది. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైనప్పటికీ అతడిని జట్టులోకి తీసుకోని సంగతి తెలిసిందే. ఆసీస్‌ పర్యటనలో అతడు విధ్వంసకర ఆడటం గమనార్హం.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని