IND vs SL: టీ20ల్లో భారత్‌  రెండో  అత్యల్ప స్కోరు  - team india registered second lowest t20 score against srilanka
close
Updated : 29/07/2021 21:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IND vs SL: టీ20ల్లో భారత్‌  రెండో  అత్యల్ప స్కోరు 

హసరంగా 4/9 అత్యుత్తమ బౌలింగ్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20లో భారత యువ బృందం తృటిలో ఘోర అవమానాన్ని తప్పించుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 81 పరుగులే చేసింది. దాంతో పొట్టి క్రికెట్‌లో తన అత్యల్ప స్కోరు 74 (2008లో ఆస్ట్రేలియాపై)ను అధిగమించి స్వల్ప తేడాతో మరో చేదు అనుభవాన్ని తప్పించుకుంది. కుల్‌దీప్‌ యాదవ్‌ (23 నాటౌట్‌; 28 బంతుల్లో), భువనేశ్వర్‌ కుమార్‌ (16; 32 బంతుల్లో) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. మరోవైపు శ్రీలంక స్పిన్నర్‌ వానిండు హసరంగ 4/9, డాసున్‌ శనక 2/20 అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశారు.

టాస్‌గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్ఇండియాను లంక బౌలర్లు ఆది నుంచే కట్టడి చేశారు. తొలి ఓవర్‌లో కెప్టెన్‌ ధావన్‌(0)ను ఔట్‌చేసి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇక నాలుగు, ఐదు ఓవర్లలో దేవ్‌దత్‌ పడిక్కల్‌(9), సంజూ శాంసన్‌(0), రుతురాజ్‌ గైక్వాడ్‌ (14; 10 బంతుల్లో 2x4) వరుసగా పెవిలియన్‌ చేరారు. దాంతో భారత ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అంతా ఔటయ్యారు. తర్వాత నితీశ్‌ రాణా(6) నిలకడగా ఆడతాడని భావించినా ఫలితం లేకపోయింది. జట్టు స్కోర్‌ 36 పరుగుల వద్ద ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే, భువనేశ్వర్‌, కుల్‌దీప్‌ వికెట్ల పతనాన్ని అడ్డుకొని ఆరో వికెట్‌కు 19 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే భువి 15వ ఓవర్‌లో ఔటయ్యాడు. తర్వాత కుల్‌దీప్‌ టెయిలెండర్లతో కలిసి భారత్‌కు పొట్టి క్రికెట్‌లో అత్యల్ప స్కోర్‌ నమోదు కాకుండా చూశాడు. రాహుల్‌ చాహర్‌(5), చేతన్‌ సకారియా (5 నాటౌట్‌)తో కలిసి జట్టు స్కోరును 81 పరుగులకు తీసుకెళ్లాడు. దాంతో ఆతిథ్య జట్టు లక్ష్యం 82 పరుగులుగా నమోదైంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని