కోహ్లీ, ఇషాన్‌ మెరుపు బ్యాటింగ్‌  - team india won the second t20 vs england
close
Updated : 14/03/2021 22:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీ, ఇషాన్‌ మెరుపు బ్యాటింగ్‌ 

రెండో టీ20లో టీమ్‌ఇండియా విజయం..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ ఇప్పుడు 1-1తో సమం అయింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ  (73 నాటౌట్‌; 49 బంతుల్లో 5x4, 3x6)తోడు ఇషాన్‌ కిషన్‌(56; 32 బంతుల్లో 5x4, 4x6) అర్ధశతకంతో చెలరేగిపోయాడు. చివర్లో పంత్‌(26; 13 బంతుల్లో 2x4, 2x6), శ్రేయస్‌(8) ధాటిగా ఆడారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. తొలి ఓవర్‌లోనే జాస్‌ బట్లర్‌(0) ఔటైనా.. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌(46; 35 బంతుల్లో 4x4, 2x6), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌(24; 23 బంతుల్లో 4x4)తో కలిసి ధాటిగా ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని చాహల్‌ విడదీశాడు. 8.2 ఓవర్‌కు మలన్‌ను వికెట్లముందు దొరకబుచ్చుకున్నాడు. తర్వాత బెయిర్‌స్టో(20; 15 బంతుల్లో 1x4, 1x6)తో కలిసి రాయ్‌ మరింత ధాటిగా ఆడాడు. అయితే, అర్ధశతకానికి చేరువైన అతడిని వాషింగ్టన్‌ సుందర్‌ బోల్తా కొట్టించాడు. అప్పటికి ఇంగ్లాండ్‌ స్కోర్‌ 91/3గా నమోదైంది. ఆపై క్రీజులోకి వచ్చిన ఇయాన్‌ మోర్గాన్‌(28; 20 బంతుల్లో 4x4), బెయిర్‌స్టోతో కలిసి బౌండరీలు బాదినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. వాషింగ్టన్‌ సుందర్‌.. బెయిర్‌స్టోను, శార్దూల్‌ ఠాకుర్‌.. మోర్గాన్‌ను పెవిలియన్‌ పంపారు. చివర్లో బెన్‌స్టోక్స్‌(24), సామ్‌ కరన్‌(6) ధాటిగా ఆడి జట్టు స్కోరును 164 పరుగులకు తీసుకెళ్లారు.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని