అడవిని దాటి.. కొండను ఎక్కి - teamindia fan sudheer kumar trekking in forest to watch odi matches between indvseng
close
Published : 27/03/2021 08:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అడవిని దాటి.. కొండను ఎక్కి

పుణె: భారత్‌లో క్రికెట్‌ పరిచయం ఉన్న అందరికీ సుధీర్‌ కుమార్‌ తెలిసే ఉంటుంది. త్రివర్ణ పతాక రంగులతో పాటు ‘ఐ మిస్‌ యూ సచిన్‌’ అని ఒంటిపై రాసుకుని, ఓ చేతిలో జాతీయ జెండా.. మరో చేతిలో శంఖం పట్టుకుని టీమ్‌ఇండియా ఆడే ప్రతి మ్యాచ్‌కు స్టేడియంలోని స్టాండ్స్‌లో కనిపిస్తాడు కదా.. అతనే సుధీర్‌. సచిన్‌కు వీరాభిమాని అయిన ఈ టీమ్‌ఇండియా ‘సూపర్‌ ఫ్యాన్‌’ జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌కు హాజరవుతాడు. కానీ కరోనా కారణంగా ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ను పుణెలోని ఖాళీ స్టేడియంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో స్టేడియంలో మ్యాచ్‌ చూసే అవకాశం అతనికి లేదు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా దగ్గర్లో ఉన్న ఘోరాదీశ్వర్‌ కొండపై నుంచి మ్యాచ్‌ వీక్షించేందుకు అడవిలో ప్రమాదకర ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పటివరకూ జరిగిన రెండు వన్డేలను అతను ఆ కొండపై నుంచే తిలకించాడు. అక్కడి నుంచి మైదానంలోని ఆటగాళ్లు కనిపించకపోయినప్పటికీ.. స్టేడియంలోని పెద్ద తెరపై ఆటగాళ్లను చూసి కేరింతలు కొడుతున్నాడు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు స్టేడియానికి చేరుకుని.. జట్టు బస్సు వచ్చిన తర్వాత శంఖంతో స్వాగతం పలుకుతాడు. ఆ తర్వాత అడవి గుండా రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి కొండపైకి ఎక్కుతాడు. చీకటి పడితే ఆ దారిలో ప్రయాణించడం కష్టమని భావించి తొలి ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లు పూర్తి కాగానే అక్కడి నుంచి వెళ్లిపోతానని అతను చెప్తున్నాడు. ఇటీవల ప్రపంచ రోడ్డు భద్రత సిరీస్‌లో తిరిగి సచిన్‌ ఆట చూసినందుకు ఉప్పొంగిపోయానని తెలిపాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని