‘టెడ్డి’ ట్రైలర్‌ వీక్షించారా..!  - teddy official trailer out now
close
Published : 24/02/2021 13:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘టెడ్డి’ ట్రైలర్‌ వీక్షించారా..! 

హైదరాబాద్‌: ‘వరుడు’, ‘రాజారాణి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన కోలీవుడ్‌ నటుడు ఆర్య. ఆయన కథానాయకుడిగా నటించిన సరికొత్త కోలీవుడ్‌ చిత్రం ‘టెడ్డి’. తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఇందులో ఆర్య నటన ఆకట్టుకునేలా ఉంది. ‘కోమా స్టేజ్‌లో లైఫ్‌కి డెత్‌కి మధ్య ఉండే కొంతమంది తమ శరీరంలో నుంచి బయటకు వచ్చి తమని తాము చూసుకోగలుగుతారు.’ అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తించేలా సాగింది. మెడికల్ మాఫియా, స్టైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆర్యకు జోడీగా ఆయన సతీమణి సాయేషా సందడి చేశారు. శక్తి సుందర్‌రాజన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ఈ సినిమా మార్చి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని