దుకాణాల సమయం కుదింపుపై సీఎస్‌ స్పష్టత - telangana govt has given clarity on lock down
close
Published : 02/04/2021 02:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దుకాణాల సమయం కుదింపుపై సీఎస్‌ స్పష్టత

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇటీవల నుంచి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో పుకార్లు జోరందుకున్నాయి. రాత్రివేళ దుకాణాల సమయాన్ని కుదిస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు దర్శనమిచ్చాయి. దీంతో ఈ పుకార్లపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. సామాజిక మాధ్యమాల్లోని జీవో కాపీ నకిలీదని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ చెప్పారు. రాత్రివేళ దుకాణాలు మూసివేత వార్త తప్పుడు ప్రచారమని ఆయన పేర్కొన్నారు. దుకాణాలు సాయంత్రం 6 గంటలకు మూసివేయాలనేది నిజం కాదన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఉండదని సీఎస్‌ స్పష్టం చేశారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని