కరోనా టీకా తయారీ రాష్ట్రానికి గర్వకారణం - telangana set to emerge as global hub for covid vaccine
close
Published : 01/02/2021 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా టీకా తయారీ రాష్ట్రానికి గర్వకారణం

మంత్రి ఈటల రాజేందర్‌  

లింగాల ఘనపురం: కరోనా టీకాను హైదరాబాద్‌లో ఉత్పత్తి చేయడం రాష్ట్రానికి గర్వకారణమని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపురంలోని భ్రమరాంబ కన్వెన్షన్‌ హాల్‌లో ఐఎంఏ (ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌) ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కరోనా టీకాను ఉత్పత్తి చేయడంతో పాటు ఒకే రోజు 10 లక్షల మందికి టీకా ఇచ్చే సమర్థత తెలంగాణకు ఉందన్నారు. అయుష్మాన్‌ భారత్‌ పథకం కంటే ఆరోగ్య శ్రీ పథకం ఎంతో మెరుగైందన్నారు. ఆరోగ్య శ్రీ పథకంలో సూచించిన వ్యాధులన్నింటికి చికిత్స అందించాలని ఐఎంఏను మంత్రి కోరారు. ఎటువంటి ఆదాయం లేకున్నా ఏడాది మొత్తం వైద్యారోగ్య శాఖ సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. కరోనా కష్ట కాలంలో సేవలు అందించిన వైద్యులను మంత్రి ఈటల అభినందించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎమ్మెల్యే రాజయ్య, ఎంఐఏ జాతీయ అధ్యక్షుడు జయలాల్‌, రాష్ట్ర అధ్యక్షుడు లవకుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని