Cinema News: నవంబర్‌ 14న టీఎఫ్‌సీసీ ఎన్నికలు - telugu News TFCC Elections will Held at november 14
close
Updated : 24/10/2021 09:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: నవంబర్‌ 14న టీఎఫ్‌సీసీ ఎన్నికలు

తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నవంబర్‌ 14న జరగనున్న ఈ ఎన్నికల కోసం శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ..‘‘ప్రస్తుతం 30 మందితో కూడిన టీఎఫ్‌సీసీ పాలక కమిటీ గడువు ముగియనుండటంతో నవంబర్‌ 14న ఎన్నికలు జరగనున్నాయి. దీంట్లో ఎవరైనా నామినేషన్‌  వేయవచ్చు. అదే రోజున ‘తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ ఎన్నికలు జరగనున్నాయి. ఆసక్తిగల వారు ఎవరైనా పోటీ చేయవచ్చు’’ అన్నారు. ‘‘టీఎఫ్‌సీసీ ప్రారంభమై ఏడేళ్లు పూర్తవుతోంది. ఇందులో 8వేల మంది సభ్యులుగా చేరడమన్నది సాధారణమైన విషయం కాదు’’ అన్నారు ఎ.గురురాజ్‌. ‘టీమా’ జనరల్‌ సెక్రటరీ స్నిగ్ధ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు ‘టీమా’లో ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. ఇకపైనా చేస్తాం. తెలంగాణ కళాకారులకు అవకాశాలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తాం’’ అన్నారు. ‘‘ఫిల్మ్‌ నగర్‌లోని టీఎఫ్‌సీసీ కార్యాలయం వద్ద ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తాం’’ అన్నారు అడ్వకేట్‌, ఎన్నికల అధికారి కేవీఎల్‌ నరసింహారావు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని