SIIMA 2020: ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయకుడు... నామినేషన్లు ఇవే! - telugu cinema siima awards 2020 nominations best music director best singer
close
Published : 01/09/2021 15:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

SIIMA 2020: ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయకుడు... నామినేషన్లు ఇవే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్ అవార్డ్స్‌ (సైమా) వేడుక మరికొన్ని రోజుల్లోనే సందడి చేయనుంది. అటు చిత్ర పరిశ్రమలో, ఇటు ప్రేక్షకుల్లో ఈ అవార్డులని ఎవరెవరు అందుకుంటారా? అనే ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే పలు విభాగాలకి సంబంధించిన నామినేషన్లని ప్రకటించిన సైమా తాజాగా  2020 సంవత్సరానికిగానూ ఉత్తమ గేయ రచయిత, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయకుడు, ఉత్తమ గాయని, ఉత్తమ పరిచయనటుడు, ఉత్తమ పరిచయనటి, ఉత్తమ సహాయనటి అవార్డుకి పోటీ పడుతున్న వారి జాబితాని విడుదల చేసింది. ఆ వివరాలివీ..

ఉత్తమ గేయ రచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (నా వెంటపడి- జాను), రామజోగయ్య శాస్త్రి (బుట్టబొమ్మ- అల వైకుంఠపురములో), దేవిశ్రీ ప్రసాద్‌ (సరిలేరు నీకెవ్వరు ఆంథమ్‌), శ్రీనివాసమౌళి (ఏమో ఏమో- రాహు), కిట్టు విస్సాప్రగడ (తరగతిదాటి- కలర్‌ఫొటో). ఉత్తమ గాయని: మధుప్రియ (హీ ఈజ్‌ సో క్యూట్‌- సరిలేరు నీకెవ్వరు), చిన్మయి (ఊహలే- జాను), స్పూర్తి (ఉండిపోవనువ్వలా- సవారి), శ్రేయా ఘోషల్‌ (వస్తున్నా వచ్చేస్తున్నా- వి), రమ్య బెహర (ఏకాంతం- కలర్‌ఫొటో). ఉత్తమ గాయకుడు: అర్మాన్‌ మాలిక్‌ (బుట్టబొమ్మ- అల వైకుంఠపురములో),  శంకర్‌ మహదేవన్‌ (సరిలేరు నీకెవ్వరు ఆంథమ్‌), కాల భైరవ (తరగతిదాటి- కలర్‌ఫొటో), ప్రదీప్‌ కుమార్‌ (లైఫ్‌ ఆఫ్‌ రామ్‌- జాను), రఘుకుంచె (నక్కిలీసు గొలుసు). ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్‌ (సరిలేరు నీకెవ్వరు), తమన్‌ (అల వైకుంఠపురములో), మహతి స్వరసాగర్‌ (భీష్మ), అమిత్‌ త్రివేది (వి), కాల భైరవ (కలర్‌ ఫొటో).

ఉత్తమ సహాయనటి: విజయశాంతి (సరిలేరు నీకెవ్వరు), టబు (అల వైకుంఠపురములో), అంజలి (నిశ్శబ్దం), సర్గున్‌ కౌర్‌ (అశ్వథ్థామ), గౌరి జి. కిషన్‌ (జాను). ఉత్తమ పరిచయనటుడు: శివ కందుకూరి (చూసీ చూడంగానే), సంజయ్‌ రావు (ఓ పిట్టకథ), అంకిత్‌ కొయ్య (జోహార్‌), శ్రవణ్‌ రెడ్డి (డర్టీ హరి), పృథ్వీ (ఐ.ఐ.టి. కృష్ణమూర్తి). ఉత్తమ పరిచయనటి: వర్ష బొల్లమ్మ (చూసీ చూడంగానే), నూరిన్‌ షరీఫ్‌ (ఊల్లాల ఊల్లాల), సలోనిలుత్రా (భానుమతి అండ్‌ రామకృష్ణ), రూప కొడువయూర్‌ (ఉమామహేశ్వర ఉగ్రరూపస్య), ప్రియాంక శర్మ (సవారి).

విజేతలను ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ద్వారా నిర్ణయించునున్నారు. www.siima.in వెబ్‌సైట్‌తో పాటు SIIMA ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా ప్రేక్షకులు తాము అభిమానించే వారికి ఓట్లు వేసి గెలిపించవచ్చు. మరి ఎవరు ఈ అవార్డుని అందుకుంటారో తెలియాలంటే సెప్టెంబరు 18 వరకు ఆగాల్సిందే. హైదరాబాద్‌ వేదికగా సెప్టెంబరు 18, 19 తేదీల్లో ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కరోనా కారణంగా గతేడాది ఈ వేడుకలు దూరమవడంతో 2019, 2020 సంవత్సరాలకి సంబంధించిన అవార్డుల్ని 2021లోనే ఇవ్వనున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని