Sampoornesh Babu: ఇప్పుడు నువ్వు... - telugu cinema wow latest promo etv sai kumar sampoornesh babu hari teja
close
Published : 02/09/2021 19:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sampoornesh Babu: ఇప్పుడు నువ్వు...

ఇంటర్నెట్‌ డెస్క్: ‘బేసిక్‌గా మోహన్‌ బాబు డైలాగ్‌ కింగ్‌. ఆ తర్వాత కర్ణాటకలో నన్ను డైలాగ్‌ కింగ్‌ అన్నారు. ఇప్పుడు నువ్వు డైలాగ్‌ కింగ్‌’ అని సంపూర్ణేశ్‌ బాబుని ఉద్దేశించి నటుడు సాయి కుమార్‌ మాట్లాడారు. ఈయన వ్యాఖ్యాతగా ఈటీవీలో ‘వావ్‌ 3’ కార్యక్రమం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ షోకి నటి హరితేజ, గాయకులు అనుదీప్‌, భార్గవి పిళ్లైతో కలిసి సంపూర్ణేశ్ బాబు విచ్చేశారు. ఈ వేదికపైనే సంపూర్ణేశ్‌ని అభినందించారు. ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై, సందడి చేస్తోంది.

ఈ నలుగురి ఎంట్రీ పూర్తవగానే సాయి కుమార్‌ ఒక్కొక్కరితో ప్రత్యేకంగా సంభాషించారు. ఈ క్రమంలోనే ‘బేసిక్‌గా మోహన్‌ బాబు డైలాగ్‌ కింగ్‌. కర్ణాటకలో నన్ను డైలాగ్‌ కింగ్‌ అన్నారు. ఇప్పుడు నువ్వు’ అని సంపూర్ణేశ్‌కి కితాబిచ్చారు. తల్లిగా ఎలాంటి అనుభూతి పొందుతున్నారని హరితేజని అడగ్గా ‘మా అమ్మపై గౌరవం పెరిగింది. తల్లిగా ఉండటం ఇంత కష్టమా! అనిపించింది’ అని తెలిపింది. అనంతరం అనుదీప్‌, భార్గవి పాటలు ఆలపించి, సంపూర్ణేశ్‌ భారీ డైలాగు చెప్పి అలరించారు. సాయి కుమార్‌ అడిగిన ప్రశ్నలకు చిలిపి సమాధానం ఇస్తూ సంపూర్ణేశ్‌ నవ్వులు పంచారు. ఈ హంగామా అంతటినీ చూడాలంటే సెప్టెంబరు 7 వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమో చూసి ఆనందించండి...



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని