రెండో దశ నాడు-నేడు.. మారనున్న 16వేల పాఠశాలల రూపురేఖ‌లు - telugu-news- minister adimulapu suresh review on nadu nedu
close
Published : 29/07/2021 15:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండో దశ నాడు-నేడు.. మారనున్న 16వేల పాఠశాలల రూపురేఖ‌లు

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

అమరావతి: కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఆగ‌స్టు 16 నుంచి అన్ని పాఠ‌శాల‌లు పునఃప్రారంభిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఉపాధ్యాయుల‌కు ఆగ‌స్టు 16లోగా వంద శాతం బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాల‌ని సీఎం ఆదేశించారన్నారు. రెండో సారి విద్యా కానుక అన్ని పాఠశాలల్లో అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పుస్తకాలు, బెల్టు, స్కూలు బ్యాగులు 80శాతం, యూనిఫాంలు 80శాతం, నిఘంటువులు 20శాతం అందుబాటులో ఉన్నాయని.. ఈ సంవ‌త్సరం అదనంగా డిక్షనరీలు అందించాల‌ని నిర్ణయించినట్లు తెలిపారు. నాడు-నేడులో భాగంగా జ‌రుగుతున్న ప‌నులు 98శాతం పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ఆగస్టు 16న వీటిని సీఎం జగన్ రాష్ట్ర ప్రజ‌ల‌కు అంకితమిస్తారన్నారు. అదే రోజు రూ.4వేల కోట్లతో రెండో దశ నాడు-నేడు పనులు చేపడతామని.. దీని ద్వారా 16వేల పాఠశాలల రూపురేఖ‌లు మారనున్నట్లు వెల్లడించారు. అమ్మ ఒడి వ‌ద్దనుకున్న 9 ల‌క్షల మంది, డిగ్రీ కళాశాలల్లో వ‌స‌తి దీవెన వదులుకున్న వారికి వ‌చ్చే విద్యాసంవ‌త్సరం నుంచి ల్యాప్ ట్యాప్‌లు ఇవ్వనున్నట్లు వివరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని