31లోపు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలి: కేటీఆర్‌ - telugu-news- trs party meeting in trs bhavan
close
Published : 28/07/2021 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

31లోపు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌: తెరాస సభ్యత్వ నమోదును ఈనెల 31లోపు పూర్తి చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శులకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పష్టం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శులతో ప్రగతిభవన్‌లోని క్యాంపు కార్యాలయంలో కేటీఆర్‌ సమావేశమయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదుపై నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. హైదరాబాద్‌ పాతబస్తీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో  కొంచెం కష్టపడితే పార్టీ బలం మరింత పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యకర్తల ప్రమాద బీమా ఈనెలాఖరుతో  ముగుస్తున్నందున.. ఆగస్టు 1 నుంచి కొత్త సభ్యత్వాల ప్రకారం బీమా కల్పించాలని సమావేశంలో నిర్ణయించారు. ఆగస్టు 1న బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించేలా కార్యాచరణ రూపొందించారు. ఇప్పటి వరకు సుమారు 50వేల సభ్యత్వాల డిజిటలీకరణ పూర్తయిందని, మిగతావి ఈనెలాఖరులోపు పూర్తి చేయాలని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఆగస్టు ఒకటిన మరోసారి సమావేశం నిర్వహించుకుందామని పార్టీ ప్రధాన కార్యదర్శులకు కేటీఆర్‌ తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని