Covid Vaccine: అక్టోబర్ మధ్య నాటికి 100 కోట్ల డోసులు..! - telugu news 1 billion covid 19 vaccinations expected before mid october sources
close
Published : 17/09/2021 22:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid Vaccine: అక్టోబర్ మధ్య నాటికి 100 కోట్ల డోసులు..!

వచ్చే నెలలో కోటి జైడస్ క్యాడిలా డోసులు

దిల్లీ: భారత్ గత కొద్ది రోజులుగా కరోనా టీకా కార్యక్రమంలో జోరు చూపిస్తోంది. నెల రోజుల వ్యవధిలో నాలుగు సార్లు కోటికి పైగా టీకా డోసుల్ని పంపిణీ చేసింది. ఇక దేశ ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా.. ప్రభుత్వం టీకా కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మంగా తీసుకుంది. రికార్డు స్థాయిలో టీకాలు వేసి, మోదీకి కానుక ఇవ్వాలని ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే రెండు కోట్ల డోసులు పంపిణీ అయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ జెట్‌ స్పీడ్‌లో టీకాలు వేస్తే.. అక్టోబర్ మధ్యనాటికి 100 కోట్ల మార్కును చేరుకుంటామని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. 

ఈ రోజు ఉదయం గణాంకాల ప్రకారం.. 77 కోట్ల మందికి టీకా వేసినట్లు కేంద్రం తెలిపింది. సాయంత్రం అయ్యేసరికి ఆ సంఖ్య 79 కోట్లకు చేరింది. ఇంకోపక్క కేంద్రం డిసెంబరు నాటికి 200 కోట్ల డోసులు అందించాలనే లక్ష్యాన్ని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న టీకాలే కాకుండా.. రానున్న నెలల్లో మరికొన్ని కొత్త టీకాలను తీసుకురానుంది. 

అక్టోబర్‌లో జైడస్ క్యాడిలా డోసులు..

ఔషధ సంస్థ జైడస్ క్యాడిలా అక్టోబర్ నెలలో కోటి టీకా డోసుల్ని మార్కెట్లోకి తేనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. 12 ఏళ్లు పైబడిన వారికి వేసేందుకు ఈ తొలి డీఎన్‌ఏ ఆధారిత టీకాకు అనుమతులు లభించిన విషయం తెలిసిందే. దీని ధరలపై చర్చ జరుగుతోందని, టీకా కార్యక్రమంలో దీన్ని చేర్చేందుకు చూస్తున్నామని నీతీ ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ మీడియాకు వెల్లడించారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని