Hyderabad: సెంచరీ కొట్టిన బామ్మ.. ఘనంగా 100వ పుట్టిన రోజు వేడుక - telugu news 100th birthday celebrations in hyderabad
close
Published : 20/09/2021 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Hyderabad: సెంచరీ కొట్టిన బామ్మ.. ఘనంగా 100వ పుట్టిన రోజు వేడుక

హైదరాబాద్: మధురానగర్‌లోని సిద్ధార్థ్‌ నగర్‌లో ఓ వృద్ధురాలి 100వ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి సమీపంలోని కశింకోటలో 1922లో జన్మించిన నవుడూరి లక్ష్మీ సూర్యకాంతం 99 ఏళ్లు పూర్తి చేసుకొని 100వ వసంతంలోకి అడుగుపెట్టారు. లక్ష్మీ సూర్యకాంతం ఏడేళ్ల ప్రాయంలో సుబ్బ వెంకటరమణను వివాహం చేసుకున్నారు. వీరికి ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు జన్మించారు. ఆమె భర్త 1995లో చనిపోగా.. సంతానంలో ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె మరణించారు. ఈ బామ్మకు 15 మంది మనమలు, మనమరాళ్లు ఉన్నారు. 16 మంది మునిమనమరాళ్లు, ఒక మునిమనమడు కూడా ఉన్నారు. బామ్మ పుట్టినరోజును ఆమె వంశ వృక్షంలోని 32 మంది కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. తమ తల్లి ఆరోగ్యంగానే ఉందని ఇంకా ఎక్కువకాలం బతికి రికార్డు సృష్టించాలని ఆమె కుమారులు ఆకాంక్షించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని