AP News: కొప్పర్రు దాడి ఘటనలో 25 మంది అరెస్టు: బాపట్ల డీఎస్పీ - telugu news 25 people arrested in guntur district kopparru incident
close
Published : 28/09/2021 14:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP News: కొప్పర్రు దాడి ఘటనలో 25 మంది అరెస్టు: బాపట్ల డీఎస్పీ

పెదనందిపాడు: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో తెదేపా నాయకురాలు శారదా ఇంటిపై దాడి ఘటన వివరాలను బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు వివరించారు. ‘‘ఈ నెల 20న వినాయకుడి నిమజ్జనోత్సవంలో తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. అదనపు బలగాలతో ఘర్షణను నియంత్రించాం. దాడిలో 8 మంది వైకాపా, ఐదుగురు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదులపై 50 మంది తెదేపా, 21 మంది వైకాపా కార్యకర్తలపై కేసులు నమోదు చేశాం. 14 మంది తెదేపా, 11 మంది వైకాపా కార్యకర్తలను అరెస్టు చేశాం’’ అని డీఎస్పీ వివరించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని