MS Raju: ‘7 డేస్‌ 6 నైట్స్‌’.. ముందుగానే పూర్తి చేశారు..! - telugu news 7 days 6 nights shoot wrap sumanth ashwin ms raju
close
Published : 27/08/2021 17:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MS Raju: ‘7 డేస్‌ 6 నైట్స్‌’.. ముందుగానే పూర్తి చేశారు..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘డర్టీ హరి’ చిత్రంతో దర్శకుడిగా మారి, తొలి ప్రయత్నంలోనే విజయం అందుకున్నారు ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌. రాజు. ఇప్పుడాయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘7 డేస్‌ 6 నైట్స్‌’. సుమంత్‌ అశ్విన్‌, మెహర్‌ చాహల్‌ నాయకానాయికలు. గురువారం ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్టు చిత్ర బృందం తెలిపింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అనుకున్న సమయానికంటే ముందుగానే షూటింగ్‌ పూర్తయిందని పేర్కొంది. 4 కెమెరాలు, 100 మంది సాంకేతిక బృందంతో గోవా, మంగళూరు, ఉడిపి ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిపారు.

‘అనుకున్న సమయానికి కంటే ముందే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఎంతో ఆసక్తిగా పనిచేసిన నా టీమ్‌కి ధన్యవాదాలు. మా అబ్బాయిని ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది. రక్తికట్టించే సన్నివేశాలు, వావ్‌ అనిపించే విజువల్స్‌తో ఈ చిత్రం అందరినీ మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’ అని దర్శకుడు ఎం.ఎస్‌. రాజు అన్నారు. ‘నా కేరీర్లో ది బెస్ట్ చిత్రంగా ‘7 డేస్‌ 6 నైట్స్‌’ నిలుస్తుంది. మా నాన్నగారే నాకు స్ఫూర్తి. ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిని కావడం ఆనందంగా ఉంది’ అని సుమంత్ అశ్విన్‌ తెలిపారు. సుమంత్ ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్స్‌ పతాకంపై సుమంత్ అశ్విన్, ఎస్. రజనీకాంత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిగిలిన కార్యక్రమాల్ని శరవేగంగా పూర్తిచేసి త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని