Rajababu: నటుడు రాజబాబు కన్నుమూత - telugu news Actor Rajababu Passed Away
close
Updated : 26/10/2021 12:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rajababu: నటుడు రాజబాబు కన్నుమూత

ప్రముఖ సినీ, బుల్లి తెర, రంగస్థల నటుడు రాజబాబు (64) కన్నుమూశారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని నివాసంలో ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన అసలు పేరు బొడ్డు వేణుగోపాల వెంకట కృష్ణ మాచిరాజు. ఆయన స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం నరసాపురపుపేట. తండ్రి బొడ్డు బసవతారకం కాకినాడలో చిన్న రైస్‌ మిల్లు నిర్వహించేవారు. వ్యాపారం చేస్తూ ఆయన రెండు సినిమాలు నిర్మించినా అంతగా ఆడలేదు. చిన్నతనం నుంచి నాటక రంగంపై ఆకర్షితుడైన రాజబాబు కాకినాడ యంగ్‌మెన్స్‌ క్లబ్‌లో సభ్యుడిగా ఉంటూ పలు ప్రాంతాల్లో నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. కృష్ణ హీరోగా వచ్చిన ‘ఊరికి మొనగాడు’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. సింధూరం, మురారీ, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, శ్రీకారం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, కల్యాణ వైభోగం, మళ్లీ రావా, బ్రహ్మోత్సవం, భరత్‌ అనే నేను.. తదితర 62 చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. బుల్లితెరపై వసంతకోకిల, అభిషేకం, రాధామధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చి।।।।సౌ।। స్రవంతి తదితర సీరియళ్లలో నటించారు. ‘అమ్మ’ సీరియల్‌లో పాత్రకు నంది అవార్డును కైవసం చేసుకున్నారు. రాజబాబుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

- న్యూస్‌టుడే, ద్రాక్షారామం



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని