Sai pallavi: ఆ ఆలోచనలు తప్పని... - telugu news Actress Saipallavi About Her Career
close
Updated : 24/10/2021 09:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sai pallavi: ఆ ఆలోచనలు తప్పని...

చిత్రసీమలోకి వచ్చిన కొత్తలో అందం విషయంలో తనకు కొన్ని భయాలు ఉండేవని చెప్పింది నటి సాయి పల్లవి. తెరపై సహజంగా కనిపించడానికి ఇష్టపడే ఈ అమ్మడు.. అంతే సహజమైన అభినయంతో దక్షిణాదిలో స్టార్‌ నాయికగా తళుకులీనుతోంది. అయితే తొలి సినిమా సమయంలో అందం విషయంలో తన ఆలోచనలు ఎలా ఉండేవని ప్రశ్నిస్తే... ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. ‘‘కాలేజీ చదివే రోజుల్లోనే ఇండస్ట్రీకి వచ్చా. అప్పుడు మిగతా సగటు అమ్మాయిల్లాగే అందం విషయంలో నాకు కొన్ని భయాలుండేవి. ఎందుకంటే అప్పటి వరకు నేను చూసిన హీరోయిన్లంతా ఎలాంటి మచ్చలు లేని అందమైన మోమున్న వాళ్లే. నేను వాళ్లలో సెట్‌ అవుతానా..? తెరపై నన్ను చూసి ‘ఈ పిల్ల ఇలా ఉందేంటి?’ అని ప్రేక్షకులంటారేమోనని అనుకునేదాన్ని. ఎవరైనా నన్ను చూస్తే.. నా ముఖంపై ఉన్న మొటిమలు చూసి మాట్లాడతారేమోనని మదన పడేదాన్ని. కానీ, ‘ప్రేమమ్‌’ విడుదలయ్యాక నా ఆలోచనలన్నీ తప్పని అర్థమైంది. ఎవరైనా క్యారెక్టర్‌నే ఇష్టపడతారు తప్ప.. పైకి కనిపించే అందాన్ని కాదని తెలుసుకున్నా. అది నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది’’ అని సాయిపల్లవి చెప్పుకొచ్చింది. ఇటీవలే ‘లవ్‌స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన ఆమె.. త్వరలో ‘విరాటపర్వం’ సినిమాతో బాక్సాఫీస్‌ ముందుకు రానుంది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని