F3: ‘ఎఫ్‌3’ కోసం సోనాల్‌ - telugu news Actress Sonal Chauhan enters To F3 Set
close
Updated : 22/10/2021 07:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

F3: ‘ఎఫ్‌3’ కోసం సోనాల్‌

రింత ఫన్‌ అంటూ ‘ఎఫ్‌3’ కోసం రంగంలోకి దిగారు కోబ్రాలు వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌. ‘ఎఫ్‌2’ తర్వాత అదే బృందం కలిసి చేస్తున్న చిత్రం ‘ఎఫ్‌3’. తమన్నా, మెహరీన్‌ కథానాయికలుగా నటిస్తుండగా, సునీల్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ నిర్మిస్తున్నారు. దిల్‌ రాజు సమర్పకులు. ఈ సినిమాలో వినోదాన్నే కాదు... అందం మోతాదుని మరింత పెంచేందుకు కథానాయిక సోనాల్‌ చౌహాన్‌ రంగంలోకి దిగింది. ఈ సందర్భంగా చిత్రబృందం సోనాల్‌ పాత్రకి సంబంధించిన లుక్‌ని గురువారం విడుదల చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సాగుతున్న సుదీర్ఘమైన షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహనం: సాయిశ్రీరామ్‌, కూర్పు: తమ్మిరాజు, సహ నిర్మాత: హర్షిత్‌ రెడ్డి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని