Most Eligible Bachelor: విజయం వచ్చింది... నిద్ర రాలేదు! - telugu news Allu arjun Attended Chief Guest For Most Eligible Bachelor Success Celebrations
close
Updated : 20/10/2021 07:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Most Eligible Bachelor: విజయం వచ్చింది... నిద్ర రాలేదు!

‘‘నాగచైతన్య, అఖిల్‌... ఇద్దరు సోదరులూ ఒకే సీజన్‌లో విజయాలు అందుకున్నారు. వారిద్దరికీ.. అక్కినేని అభిమానులకి నా అభినందనలు’’ అన్నారు అల్లు అర్జున్‌. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ విజయోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రమిది. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం  వహించారు. బన్నీ వాస్‌, వాసు వర్మ నిర్మాతలు. అల్లు   అరవింద్‌ సమర్పకులు. ఈ వేడుకని ఉద్దేశించి అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ‘‘అఖిల్‌ చాలా బాగా డ్యాన్స్‌ చేస్తాడు, ఫైట్‌ చేస్తాడు. వాటన్నిటినీ పక్కనపెట్టి, నేనొక పాత్ర చేయాలనుకున్నానని ఈ సినిమా చేశాడు. అక్కినేని కుటుంబంతో మా ప్రయాణం ఇలా కొనసాగుతూ ఉండాలి. పూజా నటన పరంగా ఈ చిత్రంతో రెండు మెట్లు ఎక్కింది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌కు విజయం అందడంతో ఆనందంగా ఉంది. నాతో సహా, ఎవరితో చేసినా అత్యుత్తమ సినిమాలు తీశారు మా నాన్న. ఆయన బెస్ట్‌. డిసెంబర్‌ 17 ‘పుష్ప’ తగ్గేదే లే’’ అన్నారు. బొమ్మరిల్లు భాస్కర్‌ మాట్లాడుతూ ‘‘విజయం కంటే సంతోషం ఓ దర్శకుడికి ఏమీ లేదు. అల్లు అరవింద్‌ ఆశీస్సులతో మొదలైందీ సినిమా. బన్నీ వాస్‌, వాసు వర్మ వెన్నెముకలా నిలిచారు. గోపీసుందర్‌ సంగీతం మేజిక్‌ చేసింద’’న్నారు. చిత్ర సమర్పకులు అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘ప్రేమించుకుందాం అనుకునేవాళ్లు, ప్రేమలో ఉన్నవాళ్లు, ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకునేవాళ్లు, పెళ్లి చేసుకున్నవాళ్లు, విడిపోదామనుకునేవాళ్లు ఈ సినిమాని చూడాల’’న్నారు. అఖిల్‌ అక్కినేని మాట్లాడుతూ ‘‘అల్లు అరవింద్‌ సర్‌తో పనిచేయడం నా అదృష్టం. అభిమానులు నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టేవరకు నిద్రపోను. ఈ సినిమాతో విజయం వచ్చింది కానీ, నాకు ఇంకా నిద్ర రాలేదు. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ముందుకు వెళదాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో పూజాహెగ్డే, వంశీ పైడిపల్లి, సురేందర్‌రెడ్డి, సంగీత దర్శకుడు గోపీసుందర్‌తోపాటు ఇతర చిత్రబృందం పాల్గొంది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని