AP News: మళ్లీ ఆ ఇంట ఆనందం.. గర్భశోకం రోజే కవలల జననం - telugu news Birth of twins to parents who lost their children in a boat accident in Papikondalu
close
Updated : 20/09/2021 11:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP News: మళ్లీ ఆ ఇంట ఆనందం.. గర్భశోకం రోజే కవలల జననం

కవల పిల్లలు, తల్లి భాగ్యలక్ష్మీతో డాక్టర్‌ సుధా పద్మశ్రీ

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే : పాపికొండల బోటు ప్రమాదంలో ఇద్దరు బిడ్డలను కోల్పోయిన రోజే మళ్లీ ఆ దంపతులకు ఇద్దరు కవలలు పుట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 2019 సెప్టెంబరు 15వ తేదీన పాపికొండల ప్రయాణంలో రాయల్‌ వశిష్ట పడవ గోదావరి నదిలో మునిగిపోయిన సంఘటన విదితమే. ఈ ప్రమాదంలో నగరానికి చెందిన తల్లారి అప్పలరాజు, భాగ్యలక్ష్మి దంపతుల పిల్లలు గీతావైష్టవి (3), ధాత్రి అనన్య (ఏడాదిన్నర) మృత్యువాతపడ్డారు. భాగ్యలక్ష్మీ చిన్నకుమార్తె పుట్టినప్పుడే ఇకపై పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీంతో ఆ దంపతులు శాంతిపురంలోని పద్మశ్రీ ఆసుపత్రి ప్రధాన వైద్యురాలు డాక్టర్‌ సుధా పద్మశ్రీని సంప్రదించారు. అమె ఐ.వి.ఎఫ్‌. చికిత్సా విధానంలో భాగ్యలక్ష్మీ మళ్లీ గర్భం దాల్చే విధంగా చేశారు. ఈనెల 15వ తేదీన భాగ్యలక్ష్మి ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా వైద్యురాలు సుధా పద్మశ్రీ మాట్లాడుతూ.. అక్టోబర్‌ 20వ తేదీన ప్రసవం వస్తుందని అంచనా వేయడం జరిగిందని.. అయితే ఈనెల 15వ తేదీన భాగ్యలక్ష్మీ పురిటి నొప్పులు రావడంతో శస్త్రచికిత్స ద్వారా పిల్లల్ని కాపాడడం జరిగిందన్నారు. పడవ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు చనిపోయిన రోజునే వీరిద్దరూ జన్మించడం ఆ దంపతుల అదృష్టంగా భావిస్తున్నామన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని